నాకు భర్త కావాలంటే ఉండాల్సింది అదే...శ్రియ
"సెన్సాఫ్ హ్యుమర్ మెండుగా ఉండాలి. తెలివితేటలు ఉండటం ముఖ్యం. విదేశాల్లో డిగ్రీ పట్టా పుచ్చుకుంటే బెటర్' అని తను కాబోయే భర్త గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది శ్రియ. అలాగే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? లేక ఎరేంజ్డ్ మ్యారేజేనా?...అనడిగితే - "ఇప్పటికైతే ఎవరితోనూ ప్రేమలో పడలేదు. భవిష్యత్ లో పడితే చెప్పలేను. కానీ నాకు ఎరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇష్టం. పెద్దలు కుదిర్చిన వివాహంలో 'సేఫ్టీ' ఉంటుందని నా ఫీలింగ్' అంది. ఇక తనకు ఫాన్స్ నుంచి చాలా లవ్ లెటర్స్ వస్తూంటాయని చెప్తోంది. "లెక్కలేనన్ని ప్రేమ లేఖలు నాకు వస్తూంటాయి. వాటిలో కొన్ని లేఖలు చదవడానికి బాగుంటాయి. కవితలు రాసి పంపిస్తుంటారు. గులాబీ పువ్వులా సున్నితంగా ఉంటావని, నీ బుగ్గలు యాపిల్ పళ్లని తలపిస్తున్నాయని, నీ కురులు మతి పోగొడుతున్నాయని..ఇలాంటి వర్ణనలు చదువుతున్నప్పుడు నవ్వొస్తుంటుంది' అన్నారు. శ్రియ ప్రస్తుతం పవన్ పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. అలాగే శ్రియ తాజాగా రవితేజ హీరోగా చేస్తున్న డాన్ శీను చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











