మీడియాపై అరిచి ఆవేశపడ్డ శ్రియ
"నా గురించి అసలేమను కుంటున్నారు? నన్ను ఇతరులతో ఎందుకు పోల్చుతున్నారు? మీరు ప్రేమలో పడ్డారా? అని నన్ను సూటిగా అడగొచ్చుగా? అనవసరంగా వేరేవాళ్లని ఎందుకు లాగడం? ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకిష్టం ఉండదు' అని శ్రియ ఆవేశపడ్డారు. లేటెస్ట్ ఈ సంఘటన 'కుట్టి' చిత్రం ప్రెస్ మీట్ లో జరిగింది. ఆ సినిమా గురించి చెప్పటం అయిపోయాక ఓ విలేఖరి..మీరు కూడా నయనతార..ప్రభుదేవా ప్రేమలో పడినట్లు ఎవరితోనన్నా లవ్ లో పడ్డారా అని నోరు జారాడు. దాంతో పై విధంగా ఆమె అరిచి రిప్లై ఇచ్చింది. ఇక ధనుష్, శ్రియ నటించిన తమిళ చిత్రం 'కుట్టి' త్వరలో విడుదల కానుంది. తెలుగు అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టైన 'ఆర్య'కి రీమేక్ ఇది.
శ్రియ ధనుష్ ఆర్య అల్లు అర్జున్ సుకుమార్ కుట్టి నయనతార ప్రభుదేవా మల్లన్న shriya allu arjun aarya sukumar kutty nayantara prabhudeva naa alludu mallanna


Click it and Unblock the Notifications