చీరకట్టు అందాలను వర్ణించడం వర్ణనాతీతం ‘శ్రియ’
భారతదేశంలోనే కాక దేశ, విదేశాలలో కూడా భారత సాంప్రదాయాల్ని పాటించే ఎందరో స్త్రీలు భారతీయ స్త్రీకి చీరే అందమంటారు. స్త్రీ యొక్క తన అంద చందలాను చీర కట్టులో ఇనుమడించి కవితలు, కవిత్వాలు అల్లే కవులు, ప్రేయసిని మెచ్చే ప్రియుడు, సినిమా లలో దర్శక నిర్మాతలు, కథలు, కావ్యాలు, తోలుబొమ్మలాట ఈ విధంగా చాలా రకాలుగా భారత స్త్రీని తన అందాన్ని చీర కట్టులో చూపిస్తూ స్త్రీని అభివర్ణించడం వర్ణనాతీతం అంటారు. అలాంటి ఒక భారత స్త్రీ 'చత్రపతి" చిత్రంలో చీరకట్టులో వంపు సొంపుల చూపిన శ్రియని చూసి పరవసించిన కోలీవుడ్ కండల వీరుడైన శరత్ కుమార్ ఓ సలహా ఇచ్చాడట. ఆ సలహా ప్రకారమే పార్టీ వేర్ గా చీరను ఎక్కువగా ధరిస్తుందట శ్రియ. భారతీయ స్త్రీకి చీరే అందమంటూ చీరపై శరత్ కుమార్ ఇచ్చిన క్లాస్ కి ముగ్థురాలైపోయిందట శ్రియ. అప్పటి నుంచే చీరపై రీసెర్చ్ చేసి మరీ, డిజైనర్స్తో తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా చీరలు డిజైన్ చేయించుకుంటోందట.
ఏ పార్టీకి వెళ్ళినా అక్కడున్న సెలబ్రిటీలంతా మోడ్రన్ డ్రస్సుల్లో దర్శనమిస్తుంటే, శ్రియ మాత్రం చీర కట్టులో ప్రత్యేక ఆకర్షనగా కన్పిస్తూ, చేసే వారిని మంత్రముగ్థుల్ని చేసేస్తోందట. మొత్తానికి కండల వీరుడు ఇచ్చిన సలహాతో శ్రియ గ్లామరస్ హీరోయిన్ గానే కాక, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సష్టించుకొంటోందన్నమాట.


Click it and Unblock the Notifications











