హాట్ స్టార్ శ్రియ...ఆ స్వామీజీ శిష్యురాలు
శ్రియ కోయంబత్తూర్ స్వామి జగ్గీవాసుదేవ్ భక్తురాలు. ఆయన ఆశ్రమానికి వెళ్లి...స్వామిజీ నేతృత్వంలో యోగాభాస్యం, ధ్యానం రెగ్యలర్ గా చేస్తూంటుంది. అలా చేయడం వల్లే ఆమె శారీరక భాష మారిందని రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.ఆమె మాటల్లోనే...మనసును నియంత్రించే శక్తి కేవలం సద్గురువుకు మాత్రమే ఉంది. అందుకే ఆయన సన్నిధిని ఆశ్రయించా. స్వామీజీ నేతృత్వంలో చేసే యోగా, ధాన్యం నాలోని మాలిన్యాన్ని పారద్రోలి..నన్నొక పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. ఇప్పటి నా మార్పుకు కారణం అదే అంటూ తన్మయంగా చెప్పింది. అయితే ప్రస్తుతం స్వామీజిలు, సినిమా యాక్టర్స్ అంటేనే అంతా ఉలిక్కిపడుతున్న ఈ సమయంలో శ్రియ ఇలా చెప్పటం ఆశ్చర్యమే అంటున్నారు. ప్రస్తుతం శ్రియ...పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పులిలో ఐటం సాంగ్ చేస్తోంది. అలాగే రవితేజ సరసన డాన్ శ్రీను చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











