పాపం శ్రియ ఆశలపై నీళ్లు చల్లిన యూనివర్సల్ స్టార్...
లోకనాయకుడు కమల్ హసన్ తాజా చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రంలో కమల్ ఒక గూడచారిగా నటించనున్నాడని సమాచారం. గూడచర్యం నేపద్యంలో థ్రిల్లర్ కధాంశంతో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తుంది. ఈ చిత్రం జూలై మొదలు కావలసి ఉంది కానీ ప్రి ప్రొడక్షన్ లో జాప్యం కారణంగా కమల్ ఆగష్టు లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు చెన్నై మీడియా కధనం.
ఇంతకుముందు ఈ చిత్రానికి సెల్వరాఘవ దర్శకత్వం వహించాల్సిఉంది. కాని ప్రస్తుతం ధనుష్ హీరోగా 'ఇరందం ఉలగం' అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా నిర్మాణం పూర్తికావటానికి మరికొంత సమయం పడుతుంది. అందుకని సెల్వ రాఘవన్ స్థానంలో కమల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో 'హే రామ్', 'పోతురాజు' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కమల్ తాజాగా 'విశ్వరూపం' చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం త్వరలోనే లండన్ లో ప్రారంభంకానుంది. బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కమల్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.
సెకండ్ హీరోయిన్ గా అయినా నటించి మళ్లీ నటిగా బిజీ కావాలని ఆశించిన శ్రియకి కమల్ హాసన్ 'విశ్వరూప" దర్శనం కాలేదు.. సోనాక్షి సిన్హాని మెయిన్ హీరోయిన్ గా ఎంచుకుని సెకండ్ హీరోయిన్ స్లాట్ ఖాళీగా పెట్టాడని తెలుసుకుని ఆ సినిమాలో అవకాశం కోసం శ్రియ చేయని ప్రయత్నమంటూ లేదు.
కానీ కమల్ ఆమె ఆశలపై నీళ్లు చల్లేస్తూ ఇషా శర్వానీకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్సిచ్చాడు. తెలుగు, తమిళ హిందీ భాషల్లో రూపొందే 'విశ్వరూపం"లో నటిస్తే ఏదో ఒక భాషలో మళ్లీ బిజీ కావచ్చునని శ్రియ ఆశించింది. కానీ కమల్ ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా బాలీవుడ్ నటి అయిన ఇషా శర్వానీకి ఛాన్సిచ్చాడు. జహీర్ ఖాన్ ప్రేయసిగా వార్తల్లోకెక్కిన ఇష ఆ త్వరలోనే పెళ్లి చేసుకోనుందని ఊకొట్టేసింది. ఇప్పటికే స్టేజ్ ఫెర్ ఫార్మర్ స్థాయికి పడిపోయిన శ్రియ ఇక హీరోయిన్ గా బిజీ కావడానికి ఎవరిని నమ్ముకోవాలో ఏమో మరి..!


Click it and Unblock the Notifications











