శ్రియా చేతిలో ఆ హీరో ఫూల్!!
హాట్ స్టార్ శ్రియ..తాజాగా హీరో విశాల్ ని ఫూల్ చేసిందనే వార్త చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆమె..విశాల్ సరసన పిస్తా అనే సినిమాలో ప్రస్తుతం చేస్తోంది. కాస్త షూటింగ్ గ్యాప్ దొరికితే ఎవరేం చెపుతున్నా వినకుండా ఫ్లైట్ లో ముంబాయి కి చెక్కేసే ఈమె ఓ రోజు ఉదయమే..విశాల్ కి ఫోన్ చేసింది. నేను మీ ఆఫీస్ బయిట ఉన్నాను. కాస్త కాస్ట్యూమ్ గురించి డిస్కస్ చేయాలి అంది. సైలెంట్ గా వచ్చి కారెక్కు అని. సర్లే కాస్సేపు ఆమెతో సిటీ చుట్టి రావచ్చు అని ఉషారుగా బయిటకు వచ్చిన విశాల్ కి ఆమె అక్కడ కనపడలేదు. దిక్కులు చూస్తూంటే అతని వదిన శ్రియారెడ్డి వచ్చి ఏప్రియల్ ఫూల్ అంది. విషయం ఏమిటీ అంటే ఆ రోజు ఏప్రియల్ ఫస్ట్. దాంతో శ్రియ, శ్రియారెడ్డి కలిసి ఈ ప్లాన్ చేసారు. ఇదే విషయాన్ని కనిపించిన అందరికీ చెప్తున్నాడు. అదీ సంగతి. నచ్చిన అమ్మాయి ఫూల్ చేసినా పరమానందమేగా...
shriya vishal april fool chennai pista shriya reddy film circle శ్రియ విశాల్ పిస్తా శ్రియారెడ్డి చెన్నై


Click it and Unblock the Notifications