అడగలేదంటూ శ్రియ ఫీలవుతోంది
అసలే ఆఫర్స్ లేక విలవిల్లాడుతున్న శ్రియ అడపా దడపా ఐటం సాంగ్స్ తో నెట్టుకొస్తోంది. ఇప్పుడు అవి కూడా దక్కేటట్లు కనపడటం లేదు. రీసెంట్ గా 'దబాంగ్"తమిళ రీమేక్ 'ఓస్తి"లో ఆమె ఐటం సాంగ్ ఉండబోతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు అబద్దమేనని అంటోంది. నన్ను ఎవరూ ఆ పాట కోసం సంప్రదించలేదు. సంప్రదిస్తే తప్పనిసరిగా ఆలోచించే దాన్ని అంటోంది. హిందిలో మలైకా అరోరా చేసిన 'మున్నీ బద్‌నామ్..." సాంగ్ కి వచ్చిన క్రేజ్ చూసి ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. అయితే దర్శకుడు ధరణికానీ, నిర్మాతలు గానీ ఆ ఊసే ఎత్తకపోవటంతో ఆమె చాలా ఫీలవుతోంది. అంతేగాక ట్యూన్ నచ్చి, పాటకు ప్రాధాన్యం ఉందనిపిస్తే ప్రత్యేక పాటలు చేయడానికి నేను ఎప్పుడూ వెనుకాడలేదు అంటోంది. ఇక ఈ ఐటం సాంగ్ కి ఎవర్నీ కన్ఫర్మ్ చేయలేదు. గతంలో శ్రియ.. తెలుగులో దేవదాసు, పులిలాంటి చిత్రాల్లో ఐటం సాంగ్ లు చేసింది.త్వరలో ఆమె తమిళంలో చేసిన 'రౌదిరం" తెలుగులో 'రౌద్రం" పేరిట విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











