దోచేసారంటూ బావురమంటున్న శ్రియ
ఇటీవల శ్రియకు స్పెయిల్‌లోని బార్సిలోనాలో ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. రవితేజతో కలిసి 'డాన్ శీను' చిత్రం షూటింగ్ నిమిత్తం ఆమె అక్కడికి వెళ్లారు. ఒక రోజు షూటింగ్ లేకపోవడంతో యూనిట్ సభ్యుల్లో కొంతమందిని తీసుకుని ట్రైన్ ఎక్కారు శ్రియ. మంచి షాపింగ్ సెంటర్ గురించి ఆరా తీసి అక్కడికి వెళ్లారు. ఇంటి అలంకరణకు కావల్సిన వస్తువులు, తన కోసం బ్యాగ్‌లు, పాదరక్షలు..ఇలా భారీ ఎత్తున షాపింగ్ చేశారామె. తనతో పాటు యూనిట్ సభ్యులు కూడా ఉండటంతో ఆ లగేజ్ మోయడం పెద్ద కష్టం కాలేదట. షాపింగ్ చేసిన ఆనందంలో తన బృందంతో సహా శ్రియ ట్రైన్‌లో తను బస చేస్తున్న హోటల్‌కు తిరుగుముఖం పట్టారు. అందరూ కబుర్లతో బిజీ అయ్యారు. రైల్లో తిరుగు ప్రయాణం. ట్రైన్ దిగేటప్పుడు చూసుకుని శ్రియ షాక్ అయ్యారు.
దారి మధ్యలో చూసుకుంటే బ్యాగ్ లేదు. ఎంత వెతికినా దొరకలేదు. దొంగోడెవడో దోచేశాడని రైలు దిగాకగానీ తెలీలేదు. "ప్రతి ఒక్కరికీ ఇలాంటి అనుభవం జీవితంలో ఒక్కసారైనా జరుగుతుంది. ఇప్పుడు నా వంతు. అయినా ఇంత చాకచక్యంగా దొంగతనం చేయవచ్చా అనిపించింది. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న వస్తువులు పోయాయని బాధపడ్డాను. ఏమైనా దొంగతనంలో వాళ్ల తర్వాతే. అయినా నేను పెద్దగా బాధపడటం లేదు. బార్సిలోనియా చాలా అందంగా ఉంది. ఓ మంచి ప్రదేశం చూశానన్న తృప్తి మిగిలింది. అది చాలు.." అని తనని తాను ఓదార్చుకుంటోంది శ్రియ. ప్రస్తుతం శ్రియ..పవన్ కళ్యాణ్..పులి చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది. అలాగే డాన్ శీను చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











