'షకీరా'ను మరిపిస్తున్న శ్రియ
విక్రమ్ తాజా సంచలనం మల్లన్న. ఇందులో విక్రమ్ నాలుగు విభిన్నమైన గెటప్స్ లో కనిపించి అందరి దృష్టినీ తన వైపు మల్లించుకున్నప్పటికీ, కథానాయిక శ్రియ కూడా తన ఉనికిని చాటుకుంది. గ్లామరస్ గా కనిపించడమే కాకుండా, డాన్సుల్లో తన సత్తాచూపించింది.
ముఖ్యంగా శ్రియ ఇంట్రడక్షన్ పాట 'అలేగ్రా అలేగ్రా' లో అయితే తన నృత్యంలో షకీరాను తలపించింది. నడుము తిప్పడంలో షకీరాతో పోల్చే వారు ఈ పాట చూస్తే ఇక నుండీ శ్రియతో పోల్చేవిధంగా వుంది ఆమె నృత్యం. స్వతహాగా కూచిపూడి డాన్సరయిన శ్రియకు డాన్స్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించాలని కోరికట...ఆ అవకాశమే వస్తే శ్రియ నృత్య విశ్వరూపాన్ని మనం చూడవచ్చు.
mallanna vikram shriya krishna susi ganeshan shakeera devi sri prasad మల్లన్న విక్రమ్ శ్రియ కృష్ణ సుశీ గణేషన్ షకీరా దేవీ శ్రీ ప్రసాద్


Click it and Unblock the Notifications