ఆ హీరోగారి ‘విశ్వరూపం’ చూస్తానంటోన్న హీరోయిన్...?

By Sindhu

నవరస నాయకుడు కమల్ హాసన్ విశ్వరూపం ప్రదర్శించడానికి సిద్ధం అవుతున్నారు. దానికి తనవంతు సాయం చేయడానికి సోయగాల సుందరి శ్రీయ రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. మన్మథన్ అంబు చిత్రం తరువాత కమల్ హాసన్ తదుపరి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించనున్న విశ్వరూపం చిత్రంలో కమల్‌కు జంటగా ముంబయి ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హాను రెండు కోట్లు ఇచ్చి ఓ హీరోయిన్ గా ఇప్పటికే ఎంపిక చేశారు. కాగా తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్ర కథలో మరో పాత్ర డెవలప్ అయిందట.

ఈ పాత్రకు శ్రీయను ఎంపిక చేసే ప్రయత్నాలలో దర్శక, హీరోలు ఉన్నారని తెలిసింది. ఈ విషయం గురించి కమల్ ఆల్ రెడీ శ్రీయతో మాట్లాడినట్లు ఆమె కూడా సమ్మతించినట్లు సమాచారం. ఇక శ్రియ తన పాత్ర గురించి తెలుసుకుని అగ్రిమెంట్‌పై సంతకం చేయడమే తరువాయి అని కోలీవుడ్ వర్గాల మాట. కాగా రజనీకాంత్ సరసన శివాజీ చిత్రంలో నటించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయిన శ్రియ ఆ తరువాత కమల్‌ కు జంటగా మర్మయోగి చిత్రంలో నటించే అవకాశం వచ్చి మిస్ అవడంతో ఎంతో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మళ్లీ అలాంటి అవకాశం 'విశ్వరూపం" ద్వారా రావడంతో ఆమె తెగ సంబరపడిపోతున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X