నా వీకెనెస్ అదే ఏం చెయ్యను..శ్రియ
నాకు ఉన్న ఒకే ఒక్క వీక్‌నెస్ 'చాక్లెట్లు'. అందుకని షాపింగ్‌కి వెళ్లినప్పుడు చాక్లెట్ డబ్బాలు కొని, ఫ్రిజ్‌ని వాటితో నింపేస్తాను' అంటున్నారు శ్రియ.ఆమె తన డైట్ కంట్రోల్ గురించి వివరిస్తూ ఇలా చెప్పుకొచ్చింది. తను ఈ మధ్య పూర్తి స్ధాయి బిజీ కావటంతో ఎక్కువ బయిట హోటల్స్ లో గడపాల్సి వస్తోందిట. దాంతో ఎక్కువగా బయిట భోజనమే చేస్తోంది. అలా కావటంతో డైట్ కంట్రోల్ చేయడం కష్టమవుతోందని శ్రియ అంటోంది. తన మెనూ గురించి ఆమె వివరంగా చెబుతూ - "ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ చేతి వంట మాత్రమే ఆరగిస్తాను. ఉదయం ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడంతో నా డైట్ ఆరంభమవుతుంది. ఒంట్లో పేరుకుపోయిన చెడు కొవ్వు అంతు చూస్తుంది ఆరంజ్. టిఫిన్‌కి మాత్రం 'ఎగ్ వైట్'తో చేసిన ఆమ్లెట్‌తో పాటు దోసె లేదా పనీర్ పరోఠా తింటాను. ఒకేసారి ఆహారం తీసుకుని ఆయాసపడటంకన్నా రెండు గంటలకోసారి తినడం మంచిది.
అలాగే కేలరీస్ తక్కువున్న ఫుడ్‌ని ప్లాన్ చేసుకుని రెండు గంటలకోసారి తింటాను. సాయంత్రం పూట తేలికగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇస్తాను. ఎక్కువగా సలాడ్స్ తీసుకుంటాను. డిన్నర్ మాత్రం అమ్మ ఏది చేస్తే అది కానిచ్చేస్తాను. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మాత్రం గ్రిల్డ్ ఫిష్, చికెన్‌లాంటి ఐటమ్స్ తింటాను. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది కాబట్టే అంత స్లీమ్ గా ఉంటోందన్నమాట.


Click it and Unblock the Notifications











