For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!

    |

    వయసు పెరిగినా అందంతో ఆకట్టుకొంటున్న హీరోయిన్లలో శ్రీయ సరన్ ఒకరు. ఏళ్లు గడిచినా.. యువ హీరోయిన్ల పోటీని తట్టుకొంటూ వరుస ఆఫర్లను దక్కించుకొంటున్నది ఈ హీరోయిన్. తాజాగా శ్రీయ నటిస్తున్న తమిళ చిత్రం సందకారి. ఈ చిత్రానికి ఆర్ మాధేశ్ దర్శకత్వం వహిస్తుండగా.. వెమల్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం మలయాళంలో విజయం సాధించిన మై బాస్ అనే చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రం ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుపుకొంటున్నది. అయితే ఈ షూటింగ్‌లో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

    లండన్ ఎయిర్‌పోర్టులో

    లండన్ ఎయిర్‌పోర్టులో

    సందకారి చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను లండన్‌లోని అత్యంత హై సెక్యూరిటీ ఉన్న ఎయిర్‌పోర్టులో దర్శకుడు మాధేష్ చిత్రీకరిస్తున్నారు. హీరో వెమల్‌తో కలిసి శ్రీయా షూటింగ్‌లో పాల్గొంటున్నది. అయితే అనుకోకుండా శ్రీయ నిషేధిత ఆంక్షలు ఉన్న ప్రదేశంలోకి అడుగుపెట్టడంతో అక్కడి పోలీసులు ఆమెకు తుపాకీ గురిపెట్టినట్టు తెలిసింది. ప్రవేశ అనుమతి లేని ప్రదేశంలోకి శ్రీయ రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించనట్టు సమాచారం.

    పెద్ద ముప్పు నుంచి శ్రీయ క్షేమంగా

    పెద్ద ముప్పు నుంచి శ్రీయ క్షేమంగా

    అయితే శ్రీయ పరిస్థితి తెలుసుకొన్న చిత్ర యూనిట్ రంగంలోకి దిగి పోలీసు ఉన్నతాధికారులను వెంటనే సంప్రదించడంతో పెద్ద ముప్పు తప్పిందట. తమ షూటింగ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను చూపించడంతో శ్రీయను లండన్ పోలీసులు వదిలి వేసినట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అయితే కొద్ది క్షణాల తేడాతో తుపాకి కాల్పుల నుంచి ఆమె తప్పించుకొన్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది.

    షాక్‌లోకి వెళ్లిన శ్రీయా

    షాక్‌లోకి వెళ్లిన శ్రీయా

    లండన్ పోలీసుల నుంచి ఊహించని పరిస్థితి ఎదురు కావడంతో శ్రీయ ఓ రకమైన షాక్‌లోకి వెళ్లిపోయింది. ప్రాణప్రాయం నుంచి క్షేమంగా బయపడటాన్ని నమ్మడానికి చాలా సమయం పట్టిందట. చిత్ర యూనిట్ అందించిన సపోర్ట్‌తో మాములు పరిస్థితికి రావడానికి చాలా సమయం పట్టినట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అనంతరం మళ్లీ యధావిదిగా శ్రీయ షూటింగ్‌లో పాల్గొన్నట్టు సమాచారం.

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
     శ్రియా కెరీర్ ఇలా..

    శ్రియా కెరీర్ ఇలా..

    ఇక సందకారి సినిమా విషయానికి వస్తే.. సండ్రా బుల్లక్, ర్యాన్ రేనాల్డ్స్ నటించిన హాలీవుడ్ చిత్రం ది ప్రపోజల్ అనే సినిమా నుంచి మలయాళంలో మై బాస్‌గా రీమేక్ అయింది. మలయాళంలో విజయం సాధించడంతో సందకారిగా రూపొందిస్తున్నారు. న్యూయార్క్, వెనీస్, కోచిలో షూటింగ్ జరుపుకొన్న ఈ చిత్రం 2020 సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

    English summary
    Shriya Saran escaped in from London police gun point. This incident happend while shooting for Sandakari movie shoot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X