బాయ్ ఫ్రెండ్ ప్రశ్నపై విరుచుకు పడిన శ్రియా శరన్?
ఎంత ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వేసిన తారలు నవ్వుతూ సమాధానాలు ఇవ్వడం చూస్తుంటాం. ఎందుకొచ్చిన తంటా అని మీడియా ప్రతినిధులతో కయ్యానికి వారు దూరంగానే ఉంటారు. కానీ అందాల తార శ్రియా శరన్ అందుకు భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనను ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధికి ఆమె షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు మీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడని ఓ టాబ్లాయిడ్ ప్రతినిధి ఇటీవల చెన్నైలో అడిగాడు. వెంటనే ఆమె అగ్గి మీద గుగ్గిలమైంది. తోక తొక్కిన తాచులా లేచింది. ఇటువంటి పర్సనల్ క్వశ్చన్స్ వేయవద్దని చెప్పింది. నేను ప్రేమలో పడితే నీకెందుకు, నాకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే నీకెందుకు అంటూ నిలదీసింది. దాంతో ఆ మీడియా ప్రతినిధికి దిమ్మ తిరిగింది. వెంటనే సారీ చెప్పాడు.


Click it and Unblock the Notifications











