'బికినీ' తో 'శ్రియ'

దాని ఫలితమే మాగ్జమ్ ఆనే ఫ్యాషన్ పత్రిక కవర్ పేజీపై ఆమె బికినీ ఫొటో. అంతేగాక 'యువకులు ఆమెను కోరుకుంటున్నారు. బాలీవుడ్ కూడా ఆమెను కోరుకుంటోంది. మాగ్జమ్ కూడా ఆమెదే' అని హెడ్డింగ్ పెట్టి మరీ కవర్ పేజీ స్టోరీ గా వేశారు. లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన జూన్ ఎడిషన్ లో ఈ అందాల ప్రదర్శన జరిగింది.
ఆ పత్రిక కోసం శ్రియ బికినీలో ఇచ్చిన ఫోజులు చూచిన వారికి మతులు పోతున్నాయట. దీంతో ముందు ముందు సినిమాల్లో సైతం శ్రియ అందాలను బికినీలో చూడవచ్చని వారు తెగ ఆనందపడుతున్నారట. ఆ పత్రికకు శ్రియ ఇచ్చిన ఫోజులు చూచినవారు ఇది పాపులర్ అయి శ్రియ కు ఆఫర్స్ తెచ్చిపెడితాయో లేదో గానీ మిగితా హీరోయిన్స్ అంతా ఆ పత్రిక లో తమ ఫొటోలు రావటానికి కృషి ప్రారంభిస్తారేమో అంటున్నారు.


Click it and Unblock the Notifications











