»   » బార్ లో భరితెగించిన భామామనులు!

బార్ లో భరితెగించిన భామామనులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాస్త వెనుకబడిన తారలు ఎలాగైన వార్తలలోనికి రావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో, వారు ఎంచుకుంటున్న మార్గం ఏమిటో తెలుసా! పబ్బులు, బార్లలో విచ్చల విడిగా త్రాగేసి తందనాలాడుతూ రెచ్చిపోయి కనిపించి..అవకాశాలు సాధించాలని..ప్రయత్నిస్తున్నారు. నిన్నటివరకూ అన్నీ హాలీవుడ్,బాలీవుడ్ ఆఫర్స్ అంటూ తిరిగిన శ్రియ ఇప్పుడిప్పుడే దారికొస్తోందంటున్నారు చెన్నై వాసులు. అయితే ఎప్పుడూ రిజర్వ్ గా ఉండే శ్రియ మొన్న ఓ పార్టీలో రెచ్చిపోయి డాన్స్ చేసేసి అందరినీ షాక్ కి గురిచేసింది. తాజాగా శ్రియ, రీమాసేన్ లు ఈ విధంగా చేస్తూ..కెమెరాలకు చిక్కారు..వారిద్దరికి స్నేహం ఎక్కడ కలిసిందో..తెలియదు కానీ..అది బాగా ముదిరి బోయ్ ప్రెండ్స్ తో బార్లలో గ్లాసులకు గ్లాసులు త్రాగేసి డాన్స్ లు చేస్తూ కెమెరాలకు చిక్కారు..

తీరా ఏంటి మీరు..చేస్తున్నది అని అడిగితే అది మేం కాదు అంటూ కొట్టి పారేస్తున్నారు. వారు చెప్పినది నిజమా అని నమ్మడానికి ప్రత్యక్షసాక్ష్యాలుగా కన్పిస్తున్న కెమెరాలలోనికి దృశ్యాలు చక్కగా దర్శనం ఇస్తున్నాయి. ఎంత సినిమాలలో అవకాశాలు సంపాదించాలని అనుకున్నా మరీ ఇంతగా బరితెగించడం ఏం బాగా లేదంటున్నారు విమర్శకులు. అన్నట్టు వారిద్దరి గురించి వారు చేసిన హంగామ గురించి కోలీవుడ్ అంతా కోడైకూస్తుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu