శృతి హాసన్ హీరోయిన్ అయ్యిందోచ్?
హీరోహీరోయిన్ల కుమారులు హీరోలు అవుతున్నారు. ఈ మధ్య హీరోహీరోయిన్ల కుమార్తెలు కూడా హీరోయిన్లు అవుతున్నారు. తాజాగా విడుదైల హిందీ సినిమా సావరియాలో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు దక్షిణాదిలో అందానికి అందం టాలెంట్ కు టాలెంట్ కలిగిఉన్న కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మడ్డీగా ముద్దుపేరుతో పిలవబడే మాధవన్ హీరోగా రూపొందనున్న సినిమాలో శృతి హీరోయిన్ గా తెరంగేట్రం చేయనున్నది. ఈ సినిమాకు నిశికాంత్ దర్శకుడు. ఈ సినిమాకు సంగీతాన్ని శంకర్-ఈషాన్-లాయ్ హిందీ త్రయం అందించబోతోంది. స్వతహాగా గాయకురాలైన శృతి కూడా ఈ సినిమాలో పాడనున్నది. లాస్ ఏంజిల్స్ లో మ్యూజిక్ లో కోర్స్ చేసిన శృతి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో శిక్షణ కూడా తీసుకుంది. పాటలు కూడా రాసే అనుభవం శృతికి ఉంది. ఇటీవలే ఒక ఆల్బమ్ ను వెలువరించింది.


Click it and Unblock the Notifications











