తమిళనాడుకు సరికొత్త వెలుగు.. కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ ఎమోషనల్ కామెంట్!

తమిళనాడు ఎన్నికల పలితాలు వెల్లడైన తర్వాత ఎవరు గెలిచారు? ఎవరు ఓడారనే విషయం పక్కన పెడితే విలక్షణ నటుడు, మక్కల్ నీధి మైయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ ఓటమి పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దక్షిణ కోయంబత్తూరు నుంచి బరిలో నిలిచిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతి చేతిలో 1728 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చి తొలిసారి పోటి చేసిన కమల్ పరాజయం పొందినా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా శృతిహాసన్ చేసిన కామెంట్ ఎలా ఉందంటే...

 ఓటర్లను ప్రలోభపెట్టకుండా

ఓటర్లను ప్రలోభపెట్టకుండా

రాజకీయాల్లో అవినీతి, డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఓట్లు సాధించడమే లక్ష్యం అని కమల్ హాసన్ తన సిద్దాంతాన్ని వెల్లడించారు. అందుకనుగుణంగానే ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రచార ఖర్చులు చేశారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా పార్టీ నేతలను సమాయత్తం చేశారు.

జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌తో

జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌తో

దక్షిణ కోయంబత్తూరులో కమల్ పోరాడి ఓడిన తర్వాత నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. గెలుపు ఓటముల పక్కన పెడితే.. రాజకీయాల్లో కమల్ కొత్త ఒరవడిని సృష్టించారు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌ను అమలు చేసి గెలుపు అంచుల వరకు వచ్చారు. తన నియోజకవర్గంలో పోటీ చేసిన మహామహులకు చెమటలు పట్టించారు అని నెటిజన్లు కామెంట్ చేశారు.

నైతికతో కూడిన రాజకీయాలు

నైతికతో కూడిన రాజకీయాలు

ఓటమి తర్వాత కమల్ స్పందిస్తూ.. నా జన్మభూమి, నా భాష, నా ప్రజల ప్రయోజనాలు పరిరక్షించడమే పార్టీ లక్ష్యం. తమిళనాడు రాజకీయల్లో నైతిక విలువలను పెంపొందించడమే నినాదం కేవలం ఎన్నికల కోసం కాదు. ఎన్నికల తర్వాత కూడా అదే లక్ష్యంతో ముందుకు వెళ్తాం అని కమల్ స్పష్టం చేశారు.

Recommended Video

Kamal Haasan, Kushboo Had Lost In Tamilnadu Assembly Elections 2021 | Filmibeat Telugu
తండ్రి ఓటమిపై శృతిహాసన్

తండ్రి ఓటమిపై శృతిహాసన్

ఎన్నికల ఫలితాలు, తండ్రి కమల్ ఓటమిపై శృతిహాసన్ స్పందించారు. నా తండ్రి అప్పటికే అభిమానమే. ఈ సందర్భంగా ఆయనను చూసి మరింత గర్వపడుతున్నాను. టార్చిలైట్ గుర్తుతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త వెలుగు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం అంటూ శృతి హాసన్ సోషల్ మీడియాలో స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X