మహేష్ కే కాదు..మహేష్ చిత్రం రీమేక్ కు కూడా

By Srikanya

చెన్నై: బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌.... తెర ఏదైనా అందాల అభినయానికి కేరాఫ్‌ అడ్రస్‌ శ్రుతిహాసన్‌. వరుస హిట్లూ, సినిమాలతో క్షణం తీరిక లేకుండా దూసుకెళుతున్న ఈ అమ్మడు సోనాక్షి నటిస్తున్న 'తేవర్‌'లో ఒక పాట పాడుతోంది. ఈ చిత్రం తెలుగులో వచ్చి హిట్టైన మహేష్ చిత్రం ఒక్కడుకి రీమేక్. అలాగే ఆమె ప్రస్తుతం మహేష్ చిత్రం ఆగడులో పాట పాడటం విశేషం. ఇలా మహేష్ తో లింక్ ఉన్న రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ అదరకొడ్తోంది.

సహజంగానే గాయని అయిన శ్రుతి పాట ఈ సినిమాకు మంచి ప్రచారం కల్పిస్తుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో శ్రుతిహాసన్‌కు పోటీ ఉన్న హీరోయిన్లలో సోనాక్షి కూడా ఒకరు. అలాంటి హీరోయిన్‌ సినిమాలో పాడటం ద్వారా తనకు ఎవరితోనూ భేషజాలు లేవని శ్రుతి ప్రకటించుకుంది.

Shruthi Haasan sings for Sonakshi

ఒక హీరోయిన్‌ను చూస్తే మరొకరికి గిట్టదు. కొత్తతరం ముద్దుగుమ్మల్లో ఇది మరీ ఎక్కువ. ఇక బాలీవుడ్‌లో అయితే ముద్దుగుమ్మల మధ్య మాటల యుద్ధం బాహాటంగానే సాగుతుంటుంది. అలాంటిది ఓ హీరోయిన్‌ సినిమాకు మరో అందగత్తె పాటేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. హీరోయిన్ల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఆహ్వానించదగ్గదే కదా అంటున్నాయి సినీ వర్గాలు.

'తేవర్‌' గురించి..

మహేష్‌ బాబు సూపర్ హిట్‌లలో ఒకటైన 'ఒక్కడు (2003) చిత్రాన్ని హిందీలో బోనీ కపూర్‌ రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మహేష్‌ బాబు పాత్రను బోనీకపూర్‌ తనయుడు అర్జున్‌ కపూర్‌ పోషించ బోతున్నాడు. ఈ చిత్రాన్ని అబ్బాస్ మస్తాన్ డైరక్ట్ చేస్తున్నారు. సంజయ్ కపూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. మొదట అభిషేక్ బచ్చన్ తో ఈ చిత్రం రీమేక్ అనుకున్నారు కానీ మెటీరియలైజ్ కాలేదు. ఈ చిత్రానికి 'తేవర్' అనే టైటిల్ నిర్ణయించారు.

తెలుగులో భూమిక చేసిన హీరోయిన్ పాత్రను సోనాక్షి సిన్హా చేసే ఈ సినిమా ద్వారా దర్శకునిగా అమిత్‌శర్మ పరిచయం కాబోతున్నాడు. వాస్తవానికి 'తేవర్' అనే టైటిల్ యశ్‌రాజ్ ఫిలిమ్స్ వద్ద ఉంది. అయితే ఆ టైటిల్ కావాలని అర్జున్ అడగడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేశాడు ఆ సంస్థ అధినేత ఆదిత్య చోప్రా. 'తేవర్'లో ఆగ్రాకు చెందిన కబడ్డీ ఛాంపియన్ అయిన కాలేజీ కుర్రాడిగా కనిపించనున్నాడు అర్జున్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X