ప్రకంపనలు సృష్టిస్తున్న హీరోయిన్ కామెంట్స్.. అతడి బండారం బయటపెడతా!

మీటూ ఉద్యమం బాలీవుడ్ లో మొదలై దక్షణాది చిత్ర పరిశ్రమకు కూడా పాకింది. దక్షణాది నటీమణులు కూడా మీటూ ఉద్యమంలో పాల్గొంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కన్నడ నటి శృతి హరిహరన్ ఇటీవల ప్రముఖ నటుడు అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ చిత్ర షూటింగ్ లో భాగంగా అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి హరిహరన్ ఆరోపించింది. శృతి హరిహరన్ వ్యాఖ్యలని అర్జున్ ఖండించారు. పలువురు హీరోయిన్లు కూడా అర్జున్ కు మద్దత్తు ప్రకటించి శృతి హరిహరన్ వ్యాఖ్యలని కొట్టిపారేశారు.

బెదిరింపులకు భయపడను

బెదిరింపులకు భయపడను

మరో మారు శృతి హరిహరన్ అర్జున్ పై సంచలనం సృష్టించే వ్యాఖ్యలు చేసింది. అర్జున్ పై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. ఎవరెన్ని బెదిరింపులు చేసినా వెనక్కి వెళ్ళను. అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడనేది నిజం అని శృతి హరిహరన్ స్పష్టం చేసింది.

ఆధారాలు ఉన్నాయి

ఆధారాలు ఉన్నాయి

నాపై పరువునష్టం దావా వేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అతడు ఎలాంటి వాడో నావద్ద ఆధారాలు ఉన్నాయి. నన్ను విమర్శిస్తున్న ప్రతి ఒక్కరికి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. పరువునష్టం దావా వేస్తే కోర్టులో ఆధారాలు చూపిస్తా అంటూ శృతి సంచలన వ్యాఖ్యలు చేసింది.

అర్థ నగ్న ప్రదర్శనలు

అర్థ నగ్న ప్రదర్శనలు

ఈ వ్యవహారంపై యంగ్ హీరోయిన్ హర్షిక స్పందించారు. అర్జున్ కు మద్దత్తు ప్రకటించారు. శృతి హరిహరన్ పై హర్షిక పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కొంతమంది మీటూ పేరుతో ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నావారే గతంలో కొందరు వద్ద అర్థ నగ్న ప్రదర్శనలు చేశారని హర్షిక సంచలన వ్యాఖ్యలు చేసింది.

అర్జున్ మంచివారు

అర్జున్ మంచివారు

అర్జున్ చాలా మంచివారని సీనియర్ నటి తార అభిప్రాయ పడ్డారు. అర్జున్ తో చాలా సినిమాల్లో కలసి నటించా. ఆయన ఏ సందర్భంలోనూ, ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు అని తార అర్జున్ కు మద్దత్తు తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X