కమల్ కూతురు శ్రుతి హాసన్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు కానీ పాపులారిటి ఎట్లా సంపాదించుకోవాలన్న దానిలో మాత్రం పిహెచ్ డి చేసిందానిలా బిహేవ్ చేస్తోందంటున్నారు. ఆ మధ్య బ్యాండు వాయించే ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడుపుతోందంటూ వార్తల్లో కెక్కిన ఆమె తాజాగా వీపుపై వేయించుకున్న టట్టుతో క్రేజ్ సృష్టిస్తోంది. మిగతా హీరోయిన్స్(త్రిష,కరీనా కపూర్,స్నేహ ఉల్లాల్,ముమాయిత్ వగైరా) అంతా భుజాలపై ,వక్షోజాలపై,బొడ్డు క్రిందగా టట్టులు వేయించుకుంటూంటే ఆమె మాత్రం వీపు పై వేయించుకుని ప్రత్యేకమైన ఫోటో సెషన్ చేయించుకుని అదరకొడుతోంది. అంతే కాక ఎక్కడ పార్టీలకెళ్ళినా ఆ టట్టు కనపడేలా డ్రస్ తో తయారవుతోంది.దాంతో అందరి కళ్ళూ ఆమె పైనే ఉంటున్నాయి. దాంతో ఆమె ప్రత్యేకమైన సెలబ్రేటిగా మారింది. చెన్నైలోని యువతకు ఆమె ఓ మోడల్ లా మారిందని అంటున్నారు. ఏదైమైనా కమల్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటే శృతి కేవలం తన ఫ్యాషన్ స్టైల్స్ తోనే మెరిసిపోతోంది.