పెళ్లైన హీరోతో ఎఫైరంటగడతారా?: శృతి హాసన్
ధనుష్ కి ఆల్రెడీ పెళ్లైంది...అయినా రజనీ అంకులో మా కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తి. ధనుష్ భార్య ఐశ్వర్య నేను చిన్నప్పటి నుంచీ ప్రెండ్స్ మి..అలాంటిది నాకు ధనుష్ తో సంభంధం అంటగడతారా..ఇలాంటి వాటి వల్ల మా సంభంధాలు దెబ్బ తింటాయి. జనవరి 1 న నేను మా అమ్మతో గుడికి వెళ్లి వచ్చి ఇంటిలో గడిపా ..అంతేగానీ ధనుష్ తో షికార్లుకు వెళ్లలేదు అంటూ ఊగిపోయింది శ్రుతిహాసన్. ఆమె ట్విట్టర్ లో ఇలా రాసుకొచ్చింది. ఆమెపై పతి..పత్ని ఔర్ ఓ తరహాలో..'ధనుష్ - ఐశ్వర్య - ఓ శ్రుతిహాసన్'అంటూ తమిళ మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి.
ధనుష్, శ్రుతిల ఎఫైర్ గురించి ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనం హాట్ టాపిక్ అయ్యింది. అందులో ఈ నెల 1న ఐశ్వర్య బర్త్‌డేకి కూడా ధనుష్ టైమ్ కేటాయించలేదని, ఆ సమయంలో శ్రుతితో పార్టీ చేసుకున్నారని కూడా రాసుకొచ్చింది. దినపత్రికలో న్యూస్ వచ్చిందంటే అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుందని చెన్నయ్ వర్గాలు ఫిక్స్ అయ్యాయి. దాంతో ఎక్కడ విన్నా ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మరో ప్రక్క ఈ చిత్రంలోని రొమాంటిక్ సన్నివేశాల్లో ధనుష్, శ్రుతి మొహమాటం లేకుండా లీనమై నటించడం కూడా సంచలనమైంది. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉంది కాబట్టే ఇంతగా లీనమయ్యారని కూడా మాట్లాడుకుంటున్నారు. శ్రుతిహాసన్‌తో స్నేహం చేయడం మొదలుపెట్టిన తర్వాత ధనుష్ తన భార్యను పట్టించుకోవడంలేదని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఇవన్నీ చదివిన రజనీకాంత్ తలపట్టుకుని కూర్చున్నాడుట. దాంతో ఇక శృతి కలగచేసుకుని ఇలా ఖండనలు పేరుతో మీడియాని తిట్టిపోసింది.


Click it and Unblock the Notifications











