కమల్ ఓల్డ్ క్లాసిక్ రీమేక్...శృతిహాసన్ తో
చెన్నై : వేరే భాషలో హిట్టైన సినిమాలను తీసుకుని రీమేక్ చేయటం విజయం సాధించటం రెగ్యులర్ గా చేసే పని. ఇప్పుడు గతంలో సూపర్ హిట్ అయిన పాత సినిమాలకు మళ్లీ కొత్త హీరోతో హంగులు అద్ది.. రీమేక్‌తో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే తెలుగులో అలాంటి ప్రయత్నాలు జరగటం పెద్దగా జరగటం లేదనే చెప్పాలి. తమిళంలో మాత్రం ఈ ట్రెండ్ ఊపందుకుంది.
ఇప్పటికే రజనీ నటించిన 'బిల్లా', 'తిల్లుముల్లు'తోపాటు, 'నాన్ అవన్ ఇల్లె' వంటి పలు సినిమాలు రీమేక్‌గా ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు భారతిరాజా దర్శకత్వంలో కమల్‌హాసన్, శ్రీదేవి, కె.భాగ్యరాజ్ నటించిన 'సిగప్పు రోజాక్కల్'ను రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి భారతిరాజా కుమారుడు మనోజ్ భారతి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. మణిరత్నం వద్ద పలు చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేశారు మనోజ్. అనంతరం తన తండ్రి దర్శకత్వం వహించిన 'తాజ్‌మహల్' ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఆశించిన స్థాయిలో ఫలితం దక్కకపోవడంతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారాయన. యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో దర్శకుడు పి.వాసు కుమారుడు శక్తి ని కమల్ పాత్రకు గానూ, శృతి హాసన్ ని అప్పట్లో శ్రీదేవి చేసిన పాత్రకు గానూ అడిగినట్లు సమాచారం. శృతి హాసన్ ఇంకా ఏ విషయం తేల్చి చెప్పలేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











