twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసభ్యంగా చేష్టలతో..చంపేస్తానంటూ శృతిహాసన్ కి బెదిరింపు, పోలీస్ కంప్లైంట్

    By Srikanya
    |

    చెన్నై:గతంలో ఈవ్ టీజింగ్ లు, వెనక పడి వేధించడాలు వంటివి చేసేవారు. పోలీస్ కేసులు అయ్యేవి. కాలం మారింది..దానితో పాటే వేధింపులు కూడా విధానం మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక వేధింపులు వీటి ద్వారా చెయ్యటం మొదలెట్టారు. అయితే కొందరు ఆ వేధింపులు నుంచి తప్పించుకోవటానికి సోషల్ మీడియాకు బై చెప్తే,సెలబ్రెటీలు మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి , వారి సంగతి చూడమంటున్నారు.

    తాజాగా హీరోయిన్ శ్రుతిహాసన్‌ కు సోషల్ మీడియా ద్వారా ఓ సమస్య వచ్చి పడింది. ఆమెను చంపేస్తానంటూ కర్ణాటకకు చెందిన ఓ డాక్టర్ బెదిరించాడట. ఈ మేరకు శ్రుతి వైద్యుడిపై తన ఏజెంట్‌ ప్రవీణ్‌ ఆంటోని ద్వారా చెన్నై సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

    పూర్తి వివరాల్లోకి వెళితే...కర్ణాటకకు చెందిన కేజీ గురుప్రసాద్‌ అనే వైద్యుడు ట్విట్టర్‌ ద్వారా ఈ ఏడాది సెప్టెంబరు 7 నుంచి తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాకు మెసేజ్‌లు చేస్తున్నాడని శ్రుతి ఫిర్యాదులో పేర్కొన్నారు.

    Shruti Haasan Files Complaint Against Cyberstalking Doctor

    అంతేకాదు అసభ్యపదజాలం వాడుతున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె తెలిపారు. ట్విట్టర్‌లో అతడు తనకు పెట్టిన మెసేజ్‌లను శ్రుతి స్క్రీన్‌ షాట్స్‌ తీసి ఫిర్యాదుకు జత చేశారట. 2013లో శ్రుతిహాసన్‌ ముంబయిలోని బాంద్రాలోగల తన ఇంట్లో ఉన్నప్పుడు ఓ దుండగుడు ఆమెను ఎటాక్‌ చేశాడు. వెంటనే శ్రుతి అప్రమత్తమవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదన్న సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది.

    గతంలో ...ఏకంగా ..సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానంటూ పోలీసులకే ఫోన్ చేసి చెప్పాడో ఆగంతకుడు. ఈ నెల 16వ తారీఖున ముంబై సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సల్మాన్‌ఖాన్‌ను అతి త్వరలో చంపేస్తానని చెప్పాడు. వెంటనే పోలీసులు ఫోన్ ఎక్కడ నుంచి వచ్చిందో ట్రేస్ చేసి వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై పోలీసులు విచారణ ప్రారంభించారు.

    English summary
    According to the complaint, Shruti was being harassed by a doctor based in Karnataka who has been abusive and has also made threats to her life. In a two-page complaint, which was submitted to the Cyber Crime grievance cell at the City Police Commissioner’s Office on Wednesday through her agent Praveen Antony, Shruti sought action against the cyber stalker who sent her abusive and derogatory messages via Twitter to her personal Twitter handle Shrutihaasan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X