సినిమా సూపర్ ఫ్లాఫ్...చెక్ లు వెనక్కి ఇచ్చేస్తున్న శృతిహాసన్
చెన్నై: సినిమా హిట్టైతే ఆ నిర్మాత పరిస్ధితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉత్సాహంగా మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తాడు. అదే ఫ్లాపైతే అప్పులు తీర్చుకుంటూ, సెల్ కట్టేసి, ఫోన్ లు ఎత్తటానికి కూడా భయపడే సిట్యువేషన్ ఏర్పడుతుంది. ముఖ్యంగా భారీ సినిమాలు చేసినప్పుడు అవి కనుక రిజల్ట్ తేడా వస్తే పరిస్ధితి దారుణంగా ఉంటుంది. అలాంటి పరిస్దితే తమిళ చిత్రం పులి నిర్మాతలకు ఏర్పడింది.
అసలే తాము భారిగా తీసిన చిత్రం ఫ్లాఫ్ అయ్యిందని భాధపడుతూంటే... అందులో కీ రోల్ చేసిన నటి శ్రీదేవి తనకు లాస్ట్ చెక్ క్లియర్ కాలేదని, తనకు యాభై లక్షలు ఇవ్వాలంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కేసు వేసింది. దానికి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన నిర్మాతలకు సాయం చేయాలనుకున్నారు అందులో హీరోయిన్ గా చేసిన శృతి హాసన్.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
శృతి హాసన్ తన లాస్ట్ చెక్ ఇరవై లక్షలు రూపాయలు ఇక చెల్లించ అక్కర్లేదని, వెనక్కి పంపించేసారని తెలుస్తోంది.అలాగే మరో కీ రోల్ లో కనిపించిన సుదీప్ కూడా అలాగే లాస్ట్ చెక్ తీర్చవద్దని వెనక్కి పంపినట్లు సమాచారం.

ఇక హీరో విజయ్ అయితే ఈ చిత్రంకు వచ్చిన నష్టాల్లో కొంత తాను భరించటానికి సిద్దంగా ఉన్నానని నిర్మాతకు తెలియచేసినట్లు తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇలా ఎవరి స్ధాయిలో వారు సాయిం చేసి ఆ నిర్మాతను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్, శ్రుతిహాసన్, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పులి'. చింబుదేవన్(23 ఏఏఎమ్ పులికేసి ఫేం) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్, శృతి హాసన్, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు.
విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘పులి' ఇటీవల విడుదల సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆలస్యంగా విడుదలైన ఈ సినిమాకు వెంటనే నెగెటివ్ టాక్ రావడం మరో పెద్ద షాక్. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు సైతం ఇలాంటి సినిమా విజయ్ ఎలా ఒప్పుకున్నాడని ఆశ్చర్య పోతున్నారు.
అయితే తమిళ స్టార్ రజనీకాంత్ మాత్రం ఈ సినిమా చాలా బావుందంటూ ప్రశంసించారు. విజయ్ పెర్ఫార్మెన్స్‌పై, శ్రీదేవి యాక్టింగుపై పొగడ్తలు గుప్పించారు. ఈ విషయాన్ని పులి నిర్మాతలు మీడియాకు వెల్లడించారు. ‘పులి' సినిమాను ఓ స్పెషల్ షో వేయించుకుని రజినీ చూశారని, ఫాంటసీ యాక్షన్ మీద నమ్మకంగా అంత ఖర్చు పెట్టినందుకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తమను అభినందించారని.. ఈ మూవీతో సౌత్ లో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవికి అభినందనలు తెలపాల్సిందిగా చెప్పారని ఎస్కేటీ స్టూడియోస్ ట్విట్టర్ లో వెల్లడించింది.


Click it and Unblock the Notifications











