సింగం-3లో సూర్యకు జోడీగా శృతి హాసన్
హైదరాబాద్: సూర్య హీరోగా తమిళ దర్శకుడు హరి దర్శకత్వంలో వచ్చిన సింగం, సింగం-2 భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో సింగం-3 చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి కూడా హరి దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో సూర్య, అనుష్క లీడ్ రోల్స్ చేయబోతున్నారు.
ఈ చిత్రంలో శృతి హాసన్ సెకండ్ హీరోయిన్ గా ఎంపికయినట్లు సమాచారం. ఆమె ఇందులో నటించడానికి అంగీకారం తెలిపిందని, అయితే అగ్రిమెంటు ఇంకా ఖరారు కాలేదని సమాచారం. త్వరలోనే ఆమె అగ్రిమెంటు మీద సైన్ చేస్తుందని తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

హరి దర్శకత్వంలో వచ్చిన ‘పూజై' చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శృతి హాసన్ పెర్ఫార్మెన్స్ లో వివిధ యాంగిల్స్ చూసిన హరి ఆమె కోసం సింగం-3 చిత్రంలో ఓ మంచి పాత్ర డిజైన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.
ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు. తమిళ కమెడియన్ సూరి కూడా ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య తన తాజా తమిళ సినిమా ‘24' షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ పూర్తయిన వెంటనే సెప్టెంబర్లో సింగం-3 చిత్రం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











