నేను నటించిన వారిలో ఆయన ఒక్కరే సంప్రదాయబద్దమైన హీరో.. శృతి హాసన్ హాట్ కామెంట్స్!
కమల్ హాసన్ వారసురాలిగా సినీరంగప్రవేశం చేసిన శృతి హాసన్ సంగీత దర్శకురాలిగా, గాయనిగా, హీరోయిన్ గా సత్తా చాటింది. శృతి హాసన్ ఓ దశలో సౌత్ లో క్రేజి హీరోయిన్ గా వెలుగొందింది. తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. వేలూరులో ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి శృతి హాసన్ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

సినీరంగ ప్రవేశం
కమల్ హాసన్ వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన శృతి హాసన్ మొదట బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. శృతి హాసన్ నటించిన తొలి హిందీ చిత్రం లక్. ఈ చిత్రం శృతి హాసన్ కు అదృష్టాన్ని తీసుకురాలేకపోయింది. శృతి హాసన్ తెలుగులో నటించిన తొలి చిత్రం అనగనగా ఓ ధీరుడు. ఈ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ చిత్రం శృతి హాసన్ కు తొలి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.

పెరిగిన అవకాశాలు
గబ్బర్ సింగ్ విజయం తర్వాత శృతి హాసన్ కు అవకాశాలు బాగా పెరిగాయి. స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలో చాలామంది స్టార్ హీరోల సరసన శృతి నటించింది. తాజాగా వేలూరులోని కళాశాల కార్యక్రమంలో పాల్గొన్న శృతి తాను నటించిన హీరోల గురించి హాట్ కామెంట్స్ చేసింది. తనకు బాగా నచ్చిన చిత్రం తన తండ్రి నటించిన మహానది అని శృతి విద్యార్థులతో తెలిపింది.

సంప్రదాయబద్ధమైన నటుడు
హీరో అజిత్ గురించి విద్యార్థులు శృతి హాసన్ ని అడగగా.. తనకు ఇష్టమైన నటులలో అజిత్ ఒకరు అని శృతి హాసన్ తెలిపింది. తాను నటించిన హీరోలలో సంప్రదాయబద్ధమైన నటుడు అజిత్ ఒక్కరే అని శృతి హాసన్ హాట్ కామెంట్స్ చేసింది. అజిత్, శృతి హాసన్ జంటగా వేదాళం చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

వినోదమే
సినీరంగంలో మీరుకోరుకునేది ఏది అని ఓ విద్యార్థి ప్రశ్నించగా.. తనకు గాయనిగా, సంగీత దర్శకురాలిగా, హీరోయిన్ గా గుర్తింపు దక్కింది. కానీ నేను ఏ విభాగంలో పనిచేసినా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలనే కోరుకుంటాను అని శృతి హాసన్ తెలిపింది. ఏ భాషలో సినిమాలు చేసినా తాను ద్రుష్టి పెట్టె అంశం నటనే అని శృతి హాసన్ తెలిపారు. వరుస పరాజయాల తర్వాత శృతి హాసన్ జోరు బాగా తగ్గింది.


Click it and Unblock the Notifications











