షూటింగ్‌లో శృతి హాసన్‌కు వింత అనుభవం: ఒకేసారి అంత మంది రావడంతో పరుగు
విశ్వ నాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ శృతి హాసన్. ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును దక్కించుకుని, సౌతిండియన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో ఉన్న అన్ని భాషల్లో అవకాశాలు అందుకుని బిజీ బిజీగా గడిపింది. తెలుగులో శృతి హాసన్ ఎన్నో సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎందరో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. వీటిలో చాలా వరకు హిట్లే ఉన్నాయి.
ఇంగ్లండ్ గాయకుడు మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న 'లాభం' అనే మూవీలో నటిస్తోంది. కరోనా ప్రభావం తగ్గుతోన్న నేపథ్యంలో ఎస్పీ జగన్నాథన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ధర్మగిరి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ హీరో, హీరోయిన్లతో పాటు కొందరు ముఖ్య నటీనటులతో క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు.

పల్లెటూరి వాతావరణంలో జరుగుతోన్న షూటింగ్‌కు సోమవారం అంతరాయ కలిగింది. హీరోహీరోయిన్లు వచ్చారన్న సమాచారం తెలియడంతో కొన్ని వందల మంది అక్కడకు చేరిపోయారు. దీంతో శృతి హాసన్ అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్లిపోయారు. దీంతో షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న కారణంగానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా, శృతి హాసన్ ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న 'క్రాక్' సహా పలు తెలుగు చిత్రాల్లోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











