‘బండ్ల గణేష్ అలా బిహేవ్ చేస్తే.. పవన్ కల్యాణ్ అడ్డుకొన్నారు’

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్‌ను ఏరియాల వారీగా గ్రాండ్‌గా ముగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఈ సినిమా పాటలు ట్రెండింగ్‌లోకి వచ్చి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

కూలీ సినిమా రిలీజ్‌కు ముందే ప్రభంజనం క్రియేట్ చేస్తున్నది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.

Shruti Haasan revealed Pawan Kalyan
కూలీ సినిమాలో నేను సత్యరాజ్‌కు కూతురిగా నటిస్తున్నాను. లోకేష్ కనకరాజ్‌తో ఇన్‌మేల్ మ్యూజిక్ వీడియో చేసినప్పుడు ఈ సినిమా కథ గురించి చెప్పారు. ఈ చిత్రంలో ప్రీతీ రోల్ మీరే చేయాలని చెప్పారు. ఈ సినిమాలో నా పాత్ర చాలా స్ట్రాంగ్, ఉమెన్ ఓరియెంటెడ్. సమాజంలోని ప్రతీ మహిళ నా పాత్రతో కనెక్ట్ అవుతారు అని శృతిహాసన్ చెప్పారు.

కూలీ సినిమాకు ముందు నాగార్జున గారితో పరిచయం ఉంది. ఆయన చార్మింగ్, వండర్‌ఫుల్. ఈ సినిమాలో వర్క్ చేయడం స్పెషల్‌గా మారింది. ఈ మూవీలో ఆయన నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ పాత్రలో ఫెంటాస్టిక్‌గా కనిపిస్తారు. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌ను. ఈ సినిమా తర్వాత సూపర్ ఫ్యాన్‌గా మారిపోయాను. మీరు ఇంకా రెడీ లేరనుకొంటాను. ఈ సినిమాలో చాలా కూల్‌గా కనిపిస్తారు అని శృతిహాసన్ తెలిపారు.

తెలుగులో నేను నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు.అయితే ఆ రెండు సినిమాలు ఒకే హీరోవి. కానీ హీరోను పట్టించుకోలేదు. దాంతో నన్ను ఐరెన్ లెగ్ అన్నారు. నా కాళ్లను వదలేయండి. నేను ఐరన్, గోల్డెన్ లెగ్ కాదు. పవన్ కల్యాణ్‌తో మూడో సినిమా గబ్బర్ సింగ్‌‌లో నటించాను. అది సూపర్ హిట్ అయింది. అప్పుడు వచ్చిన అప్రిషియేషన్ నాకు హ్యాపీ అనిపించింది అని శృతిహాసన్ తెలిపారు. నేను ప్రశంసలు, విమర్శలను పెద్దగా సీరియస్‌గా తీసుకొను అని ఆమె చెప్పారు.

గబ్బర్ సింగ్ సినిమా నుంచి నన్ను తీసేద్దామని నిర్మాత బండ్ల గణేష్ అనుకొన్నారు.ఆ విషయాన్ని పవన్ కల్యాణ్‌కు చెబితే ఒప్పుకోలేదు. ఆయన ఆ ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ వేసింది అని ఆమె చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా బండ్ల గణేష్ చెబుతూ.. శృతిహాసన్‌ను తీసివేద్దామని పవన్ కల్యాణ్‌కు చెప్పాను. అయితే ఆయన ఎందుకని ప్రశ్నించారు. ఆమెకు అన్నీ ఫ్లాప్ సినిమాలే ఉన్నాయన్నాను. అయితే నీవు అన్ని హిట్ సినిమాలు తీశావా? ఆమెను తీసివేసే ప్రసక్తి లేదని పవన్ కల్యాణ్ చెప్పారని ఆలీతో జరిగిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ వెల్లడించారు.

More from Filmibeat

Read more about: shruti haasan pawan kalyan coolie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X