కరుణానిధి మరణించి అంతా ఏడుస్తుంటే, శృతి హాసన్ పైత్యం.. మత్తు వదిలిస్తున్నారు!

Recommended Video

Shruti Haasan Gets Serious Comments On Her From Fans

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ రాంగ్ టైం అంటే ఏంటో ఇప్పుడు బాగా తెలిసివచ్చేలా ఉంది. అసలే సినిమాలు లేకపోవడంతో ఆడియన్స్ లో ఫోకస్ బాగా తగ్గింది. దిగ్గజ రచయిత, రాజకీయ కురు వృద్ధుడు కరుణానిధి మరణంతో తమిళులంతా శోకసంద్రంలో ఉన్నారు. ఆ మాటకు వస్తే దేశం మొత్తం కరుణానిధి మరణానికి సంతాపం తెలియజేస్తోంది. భాష ప్రాంతీయ భేదం లేకుండా సెలెబ్రిటీలంతా కరుణానిధికి సంతాపం తెలియజేస్తున్నారు. కానీ శృతి హాసన్ మాత్రం నెటిజన్ల చేతిలో చిక్కింది. వివరాలు చూద్దాం.

 కరుణానిధి మరణం

కరుణానిధి మరణం

ఐదు సార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు సినీ ప్రముఖుడు. ఎన్నో చిత్రాలకు ఆయన రచనలు, స్క్రీన్ ప్లే అందించారు. కరుణానిధి ఆదివారం మంగళవారం తుదిశ్వాస విడవడంతో సినీ రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు.

అంతా శోకంలో

అంతా శోకంలో

తమిళులంతా కరుణానిధి మరణించడంతో శోకంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులందరూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా సందేశాలు పెడుతున్నారు. కానీ శృతి హాసన్ మాత్రం తాను లండన్ లో చేస్తున్న ఓ ఆల్బమ్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి విమర్శల పాలవుతోంది.

ఫన్ టైం అంటూ

ఫన్ టైం అంటూ

శృతి హాసన్ చేతిలో ప్రస్తుతం పెద్దగా చిత్రాలు లేవు. లండన్ లో ఓ ఆల్బమ్ షూట్ లో శృతి హాసన్ పాల్గొంది. వీరితో కలసి పనిచేయడం చాలా సరదాగా ఉందని శృతి హాసన్ ట్వీట్ చేసింది. శృతి హాసన్ చేసిన ఈ సింపుల్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

సంతాపం తెలపలేదని

సంతాపం తెలపలేదని

ద్రవిడ జాతికోసం పోరాటం చేసిన సినీరాజకీయ దిగ్గజం మరణిస్తే కనీసం సంతాపం తెలిపేందుకు కూడా ఓ ట్వీట్ చేయలేదు. కానీ ఫన్ టైం అంటూ ట్వీట్ చేసింది అని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ సమయంలో

ఈ సమయంలో

కరుణానిధికి ఎలాగు సంతాపం తెలపలేదు. కనీసం నీ పని గురించి ఈ సంయమలో మాట్లాడవద్దు అంటూ ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. చాలా చాల మంది హృదయాలు బరువెక్కేలా కరుణానిధి దూరమయ్యారు.

సురేష్ రైనా కూడా

సురేష్ రైనా కూడా

క్రికెటర్ సురేష్ రైనా, తెలుగు నటులు కూడా కరుణానిధి మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. కానీ శృతి హాసన్ కి మాత్రం ఇలాంటి విషయాలేవీ పట్టినట్లు లేవు అని మరో నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. నీకు ఏమాత్రం సింపతీ లేదా అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

కమల్ హాసన్

కమల్ హాసన్

ఇదిలా ఉండగా విశ్వరూపం 2 ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా కమల్ హాసన్ ఉన్నారు. కరుణానిధి మరణించిన వార్త తెలియగానే ఆయన వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరి చెన్నై వెళ్లారు. కరుణానిధిని కడసారి దర్శించి నివాళులు అర్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X