నాన్నతో గౌతమి ఉంటే నాకేంటి ప్లాబ్లం...శృతి హాసన్
మా నాన్నకి, గౌతమికి మధ్య ఉన్న బంధం పై నాకేమీ అబ్జెక్షన్ లేదు. అలాగే మేము మా జీవితాల్లోకి గౌతమి రావటాన్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. మా నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను అంది శృతి హాసన్ తాజాగా చెన్నై లోని మీడియాతో గౌతమి గురించి మాట్లాడుతూ. అలాగే మా నాన్న నాకు రోల్ మోడల్. నేను చిన్నప్పటినుంచీ ఆయన నటన చూస్తూనే పెరిగాను. ఆయన నటన అనేది నేర్చుకుంటే వచ్చేది కాదని, మనలోనే ఉంటుందని చెప్తూంటారు అంది. ఇక తను ప్రస్తుతం చేస్తున్న హీరో సిద్దార్ధ గురించి చెబుతూ..సిద్దార్ధ అద్బుతమైన నటుడు. అలాగే మంచి స్నేహితుడు కూడా. ఇక హిందీలో ఆఫర్స్ గురించి అంటారా..కంటెన్యూగా వస్తూనే ఉన్నాయి. అయితే నేను నాకు తగ్గ పాత్ర ఎంపిక చేసుకుని అప్పుడు సైన్ చేస్తానని చెప్తున్నాను. ఇక ముంబైలో ఇల్లు ఉండటంతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. చెన్నైకి షిప్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నాను.
కమల్ హాసన్ 'సహజీవిత భాగస్వామి" గౌతమి త్వరలో మెగా ఫోన్ చేపట్టనుంది. కమల్ గురువు కె.బాలచందర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో చేస్తున్నారు. ఈ చిత్రం రాజకమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి కమల్ కుమార్తె శృతిహాసన్ సంగీతాన్ని అందించనున్నారు. మాధవన్ మరో ముఖ్యపాత్ర పోషించే ఈ చిత్రంలో కమల్ కూడా అతిధి పాత్రలో కనిపించునున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇక కమల్ హీరోగా త్రిష హీరోయిన్ గా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభం కానుంది. అది పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా రూపొందింది. ప్రస్తుతం శృతి హాసన్..తమిళ హీరో సూర్య సరసన మురగదాస్ దర్శకత్వంలో చిత్రం ఓకే చేసింది. అలాగే రాఘవేంద్రరావు తనయుడు సూర్య ప్రకాశరావు దర్శకత్వంలోనూ ఓ ఫాంటసీ చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











