ప్లాప్ అవుతుందని ముందే ఊహించా: శృతి హాసన్
సాధారణంగా సినిమా చేస్తున్నప్పుడే ఆ సినిమా హిట్ అవుతుందో, లేక ఫట్ అవుతుందో అర్థమైపోతుంది. 'త్రీ' విషయంలో ఈ ఫలితం నేను ముందు ఊహించిందే అంటోంది శృతిహాసన్. ఆమె ఈ మాటలను తాజాగా ఆమె నటించి,భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయిన 'త్రీ'చిత్రం గురించి చెప్పుకొచ్చింది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజైన మార్నింగ్ షో కే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. 'కొలవెరి' సాంగ్ తో ఎంతో క్రేజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ సైతం భారీ నష్టాలనే ఇచ్చింది. తెలుగులో ఈ చిత్రం అందించిన నట్టికుమార్ ఈ సినిమా పై తనకు వచ్చిన నష్టాన్ని...నిర్మాతలే భరించాలని కూడా డిమాండ్ చేసారు.
ఇక శృతి ఈ చిత్రం ప్లాప్ ని విశ్లేషిస్తూ...నిజానికి ఈ సినిమాను నేను అంగీకరించినప్పుడు, నా పాత్రను మాత్రమే విన్నాను. పూర్తిగా కథ వినలేదు. సెట్స్‌కి వెళ్లాక తెలిసింది. ఇదొక సైకలాజికల్ సబ్జెక్ట్ అని. ఎంతో జాగ్రత్త తీసుకుంటే కానీ ఇలాంటి కథలు ప్రజల్లోకి వెళ్లవు. త్రీ' తీసుకొచ్చిన ఫలితాల మాట అటుంచితే నటిగా ఎంతో తెలుసుకోగలిగాను. ఆ సినిమా చూసి నాన్న కూడా మెచ్చుకొన్నారు.
ఇక గతంలో నాన్న చేసిన 'మూండ్రంపిరై' చిత్రం సైకలాజికల్ సబ్జెక్టే. బాలూ మహేంద్ర దర్శకత్వ ప్రతిభ, నాన్న అభినయం ఆ సినిమాను సూపర్‌హిట్ చేసింది. అదే 'వసంతకోకిల'గా తెలుగు విడుదలై ఇక్కడ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా టైమ్‌కి నేను పుట్టలేదు. కానీ అది నా ఫేవరెట్ మూవీ. 'త్రీ' సినిమా కూడా ఆ కోవకు చెందినదే. ఇది టార్గెట్‌ని రీచ్ కాదేమో అని నిర్మాణం సమయంలోనే అనిపించింది. చివరకు నేను అనుకున్నదే జరిగింది.
'కొలవెరి' సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అదే 'త్రీ'ని ఇలాంటి కథతో కాకుండా, రెగ్యులర్ ఫార్ములాతో తీసుంటే పెద్ద హిట్ అయ్యేది. ఏదైతేనేం... నా పాత్రకు మంచి పేరొచ్చింది. 'గబ్బర్‌సింగ్'లోనూ మంచి పాత్రే లభించింది. ఈసారి గురి తప్పదనే నమ్ముతున్నా'' అంటోంది.
'గబ్బర్‌సింగ్' మాత్రం ఈ ఏడాది విడుదలైన సినిమాలన్నింటిలో బిగ్ హిట్‌గా నిలుస్తుందని చేస్తున్నప్పుడే అర్థమైపోయింది. నా కెరీర్‌ని మలుపుతిప్పే సినిమా అవుతుంది 'గబ్బర్‌సింగ్'. ఎందుకంటే ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ అందులో ఉన్నాయి'' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











