ఐదు పెద్ద సినిమాల్లో ఆమే హీరోయిన్
తెలుగు, తమిళ భాషల్లో బాగా బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరూ అంటే శృతి హాసన్ అంటున్నారు. ఆమె వరసగా ఐదు పెద్ద సినిమాలు చేస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ సరసన బోయపాటి శీను దర్శకత్వంలోనూ, దిల్ రాజు నిర్మిస్తున్న 'ఓ మై ఫ్రెండ్' చిత్రంలో సిద్ధార్థ్ సరసన చేస్తోంది. అలాగే 'దబాంగ్' తెలుగు రీమేక్ 'గబ్బర్‌సింగ్'లోనూ పవన్ కల్యాణ్ సరసన కమిటైంది. ఇక తమిళ విషయానికి వస్తే ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన 'ఎళామ్ అరివు' చిత్రంలోనూ నటిస్తోంది. ఆ సినిమా పూర్తి కావొచ్చింది.అలాగే రనీకాంత్ కుమార్తె సౌందర్య భర్త ధనుష్ ను డైరక్ట్ చేస్తూ తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెనే బుక్ చేసారు. ఈ సినిమాని ధనుష్ నిర్మిస్తారు.ఇంకా హిందీ నుంచి సైతం ఆఫర్స్ వస్తూంటే డేట్స్ ఖాళీ లేవని చెప్తోందీ ముద్దుగుమ్మ.సైలెంట్ గా ఉంటూనే వరస ఆఫర్స్ పట్టేసిందని అందరూ నోరు వెళ్లబెడుతున్నారు.


Click it and Unblock the Notifications











