విజయ్ 58కి శృతి హాసన్ ఓకే చెప్పింది
హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్ ఎట్టకేలకు విజయ్ సినిమా విషయాన్ని ఖరారు చేసింది. తమిళ హీరో విజయ్ తన కెరీర్లో చేయబోతున్న 58వ సినిమాకు ఆమె ఓకే చెప్పింది. ఈ సినిమాకు సైన్ చేసిన విషయాన్ని ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
ఈ సినిమా వివరాలను శృతి తన ట్విట్టర్ పేజీలో వెల్లడిస్తూ ' విజయ్ సార్ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యాను. ఈ చిత్రానికి చింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదొక ఇతిహాస చిత్రం' అంటూ శృతి హాసన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
శృతి హాసన్ తొలిసారిగా విజయ్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం మీడియా, ఆడియన్స్ 'విజయ్ 58' అని పిలుస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో హాలీవుడ్ సినిమాల్లో మాదిరి వరల్డ్ క్లాస్ గ్రాఫిక్స్ చూడబోతున్నాం. ఈ చిత్రంలో విజయ్, శృతి హాసన్‌తో పాటు కన్నడ స్టార్ సుదీప్, నిన్నటితరం ప్రముఖ నటి శ్రీదేవి కూడా ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.
శృతి హాసన్... విజయ్ సినిమాలో ఎంపిక కావడంపై ఇటు ఆమె ఫ్యాన్స్‌తో విజయ్ అభిమానులు కూడా ట్విట్టర్లో కామెంట్ల వర్షం కుపించారు.

శృతి హాసన్ తమిళంలో...
ప్రస్తుతం శృతి హాసన్ తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న పూజై చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

తెలుగులో...
తెలుగులో ఇటీవల ‘రేసుగుర్రం' చిత్రంలో నటించిన శృతి హాసన్....ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘ఆగడు' చిత్రంలో స్పెషల్ సాంగు చేస్తోంది.

విడుదలకు సిద్ధమైన హిందీ సినిమాలు
శృతి హాసన్ నటించిన రెండు హిందీ సినిమాలు ‘గబ్బర్', ‘వెల్ కం బ్యాక్' చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

చిత్రీకరణ దశలో...
దీంతో పాటు రాఖీ హాండ్సమ్, యార్ అనే హిందీ చిత్రాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











