twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఘజిని మొహమ్మద్ రేస్ లో శృతి హాసన్ !

    By Srikanya
    |

    చిత్ర పరిశ్రమలో పరిచయమయ్యేందుకు సినీ నేపథ్యం ఎంతగానో ఉపకరిస్తుందన్నది తేటతెల్లమే. అయితే ఆ తర్వాత తమను తాము నిరూపించుకుంటేనే వారి కెరీర్‌ అద్భుతంగా ప్రకాశిస్తుంది. సక్సెస్‌ వెనుక పరుగులు తీసే పరిశ్రమలో ఇందులో ఎంతటి వారికైనా మినహాయింపు అంటూ ఉండదు. జాతీయ నటుడు కమల్‌ కుమార్తె శృతిహాసన్‌ కూడా తానేంటో నిరూపించుకోవాలని ఎంతో పట్టుదలతో ఉంది. అయినా ఇంతవరకు ఆమెను సక్సెస్‌ వరించకపోవడంతో ప్రయోగాల శృతిగా అభివర్ణిస్తున్నారు. నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి కావాలన్న జిజ్ఞాసో లేక ఏదో ఒక శాఖలో నిలదొక్కుకోవాలన్న తపనో ఆమెను పరిశ్రమలోని వివిధ శాఖలలో ప్రవేశించేలా చేసిందని పరిశ్రమలో అంటున్నారు.

    కమల్‌ కూడా తొలుత కొరియోగ్రాఫర్‌గా, ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా ఇలా వివిధ శాఖల్లో అడుగుపెట్టినవారే. డ్యాన్సర్‌గా మంచిపేరు పొందినప్పటికీ, నటుడిగానే ఆయన స్థిరపడి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కోవలో ఆయన కుమార్తె కూడా ఏ శాఖలో పేరు వస్తుందోనని పరీక్షించుకుంటున్నట్లుగా కనిపిస్తోందని సినీవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హిందీలో ఆమె నటించిన 'లక్కీ' సినిమా అపజయం పొందటం, అలాగే ఆమె సంగీతాన్ని అందించిన 'ఈనాడు' సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో శృతి తెలుగులో హీరోయిన్‌గా మళ్లీ ప్రయోగం చేస్తోంది. సిద్ధార్థ కథానాయకుడిగా కె.ప్రకాష్‌ దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్న చిత్రంలో శృతి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతోనైనా శృతి కెరీర్‌ మలుపు తిరిగి హీరోయిన్‌గా స్థిరపడుతుందేమో వేచిచూడాల్సిందేనని అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X