Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్టార్ హీరోని, డైరక్టర్ కి ముప్పు తిప్పలు పెడ్తున్న శృతిహాసన్
కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్....తమిళ దర్శకుడు మురగదాసన్ దర్శకత్వంలో 'ఎంజుమ్ అరివు' చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గజనీ సూర్య హీరో. ఇక శృతి రోజూ సెట్ కి మూడు నుంచి నాలుగు గంటలు లేటుగా రావటం, ఆమె కోసం హీరో, దర్శకుడు, యూనిట్ ఎదురుచూడటం నిత్య కృత్యమైపోయిందిట. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్ధితుల్లో తలపట్టుకు కూర్చుంటున్నారుట. నిర్మాత మాత్రం ఆమె తండ్రి కమల్ హాసన్ కి కంప్లైంట్ చేద్దామంటూంటే అలా చేస్తే శృతి మూడ్ దెబ్బ తిని టోటల్ గా సినిమాకే దెబ్బ తగిలే అవకాశం ఉందని భయపడుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం శృతికి తెలియదా అంటే తెలిసే ఉంటుందని అయితే లెక్క చేయటం లేదని అంటున్నారు. సర్కస్ నేపధ్యంలో కథ జరగనుంది.
ఇక ఈ చిత్రంలో సూర్య సర్కస్ కళాకారుడిగా నటిస్తున్నారు. సూర్య పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. యానిమల్ ట్రైనర్ గా ఓ విభిన్నమైన పాత్ర ఇది అని చెప్తున్నారు. ఈ పాత్ర కోసం సూర్య కొందరు సర్కస్ కళాకారులతో మాట్లాడినట్లు తెలిసింది. కోయంబత్తూర్ లోని గ్రేట్ ముంబై సర్కస్ లో ఈ చిత్రం షూటింగ్ కొంతకాలం జరుగింది. అలాగే మరి కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల కోసం చైనా వెళ్ళనున్నారని తెలుస్తోంది. రెడ్ జెయింట్ పతాకంపై నిర్మాత ఉదయనిధి స్టాలిన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కె.రవిచంద్రన్ కెమెరా అందిస్తున్నారు. ఇక శృతి హాసన్ తెలుగులో కూడా సిద్దార్ధ సరసన రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాష్ దర్శకత్వంలో నటించింది.