షూటింగ్ లో ప్రమాదం..శృతి హాసన్ కు గాయాలు..సేఫ్
చెన్నై అవుట్ స్కర్ట్స్ తాంబరం రోడ్డులో షూటింగ్ జరుపుకుంటున్న '7 ఓం అరివు' లో రిస్కీ స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుంటే హీరోయిన్ శృతిహాసన్ గాయపడ్డారు. స్టంట్ లో పాల్గొంటుంటే పట్టుతప్పి గాయాలయ్యాయి. అయితే సీరియస్ మాత్రం కాదు. అలాగే ఆమె మోచేయికి బాగా దెబ్బ లు తగిలాయి. ప్రస్తుతం ఆమె రెస్ట్ లో ఉంది. ఆమెకు గాయం తగిలిందని హీరో సూర్య మొదట గమనించి ఆమెను బయిటకు తీసుకెళ్ళారు. డాక్టర్స్ ప్రమాదమేమీ లేదని కొద్దిగా రెస్ట్ తీసుకుంటే చాలని పెయిన్ కిల్లర్స్ ఇచ్చారని తెలుస్తోంది. 'గజిని' కాంబినేషన్ మురగదాస్, సూర్య కలిసి చేస్తున్న ఈ కొత్త చిత్రం '7 ఓం అరివు' సర్కస్ నేపధ్యంలో కథ జరగనుంది.
ఈ చిత్రంలో సూర్య సర్కస్ కళాకారుడిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో సూర్య పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. యానిమల్ ట్రైనర్ గా ఓ విభిన్నమైన పాత్ర ఇది అని చెప్తున్నారు. ఈ పాత్ర కోసం సూర్య కొందరు సర్కస్ కళాకారులతో మాట్లాడినట్లు తెలిసింది. కోయంబత్తూర్ లోని గ్రేట్ ముంబై సర్కస్ లో ఈ చిత్రం షూటింగ్ కొంతకాలం జరుగింది. అలాగే మరి కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల కోసం చైనా వెళ్ళనున్నారని తెలుస్తోంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న రెడ్ జెయింట్ పతాకంపై నిర్మాత ఉదయనిధి స్టాలిన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కె.రవిచంద్రన్ కెమెరా అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











