ఆ హీరో చాలా హాట్. కళ్ళలోకి ఏ అమ్మాయి చూసినా ప్లాట్...
తమిళ హీరో సూర్య చాలా హాట్..అంటోంది హీరోయిన్ శృతిహాసన్. సూర్యతో కలిసి 'ఎజాన్ అరివు" అనే తమిళ సినిమాలో నటిస్తోన్న శృతిహాసన్, షూటింగ్ టైమ్ లో సూర్య నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది ఓ ఇంటర్వ్యూలో. సూర్య కళ్ళు చాలా ఎక్స్ ప్రెసివ్ అనీ, ఒక్కసారి ఆ కళ్ళలోకి స్ట్రెయిట్ గా ఏ అమ్మాయి చూసినా ప్లాట్ అయిపోవాల్సిందేనని, తానూ అలానే ప్లాట్ అయిపోయానని చెబుతోంది శృతిహాసన్.
వర్క్ విషయంలో సూర్య చాలా సిన్సియర్ అంటోన్న శృతి సిన్సియారిటీ, సీరియస్ నెస్..ఇవన్నీ సూర్య నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశాలంటూ సూర్యపై ఓ రేంజ్ లో అభిమానాన్ని కురిపించేస్తోంది. బాలీవుడ్ కి తానేమీ దూరమైపోలేదనీ, రెండు మూడు సినిమాలు డిస్కషన్స్ లో వున్నాయనీ, వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానంటోంది శృతిహాసన్. గ్లామర్ ప్రపంచంలో మడికట్టుక్కూర్చుంటే సరిపోదనీ, సన్నివేశానికి తగ్గట్టుగా బికినీ అయినా, లిప్ కిస్ సన్నివేశంలో అయినా నటించిక తప్పదని శృతిహాసన్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











