»   » అసిన్ ని కాదని శృతి హాసన్ కే ఛాన్స్

అసిన్ ని కాదని శృతి హాసన్ కే ఛాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గజనీ తమిళ, హిందీ వెర్షన్ లలో చేసిన అసిన్ ని తర్వాత మురుగదాస్ చిత్రంలో హీరోయిన్ గా అంతా ఊహించారు. అందులోనూ ఆ చిత్రంలోనూ సూర్య హీరోగా చేయటంతో కన్ఫర్మ్ అనే నిర్ణయానికి వచ్చేసారు. అలాగే అసిన్ కూడా అనుకుంది. అయితే సీన్ రివర్స్ అయింది. అసిన్ ప్లేస్ లో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ కూతురు శ్రుతి హాసన్‌ వచ్చి చేరింది. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌ నిర్మిస్తున్నారు. టైటిల్ ఇంకా ఖరారు కానీ చిత్రానికి హారిస్‌ జైరాజ్‌ సంగీతం, రవి కె.చంద్రన్‌ కెమెరా బాధ్యతల్ని తీసుకున్నారు. సూర్య హీరోగా చేసే ఈ చిత్రాన్ని తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. అలా పాపం అసిన్‌కి ఓ భారీ చిత్రం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఇదే చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu