సిద్దార్థ కన్నింగ్ ప్లాన్-పసిగట్టి ఛీకొట్టిన శృతి!
యాక్టర్ సిద్దార్థ సీనియర్ నటుడు కమల్ హాసన్ ను అనుసరిస్తున్నాడు. అంతే కాదు తనను తాను జూనియర్ కమల్ హాసన్‌లా ఫీలవుతున్నాడు. నటన విషయంలోనే కాదు పర్సనల్ లైఫ్ విషయంలోనూ ఇలానే ఫీలవుతున్నాడు. కమల్ మాదిరి తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్దార్థ ఏర్పాట్లు చేసుకుంటున్నాడని చెన్నయ్ సినీ వర్గాల సమాచారం. సిద్ధు గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి సోహా అలీఖాన్‌తో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వినిపస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సిద్ధార్థ తన ప్లాన్ మార్చుకున్నాడు. గతంలో శృతితో 'సం"బంధం నెరపిన ఇతగాడు తాజాగా ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేశాడు.
దీని వెనక్ పెద్ద స్టోరీనే ఉందని చర్చించుకుంటున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు కమల్ హాసన్, ఆయన కూతురును పెళ్లి చేసుకుంటే తనకూ అదే స్థాయిలో గుర్తింపు వస్తుందని, బాలీవుడ్ సినిమాల్లో రాణించే అవకాశం ఉంటుందనేది అతని ఆలోచనట. ఆ తర్వాత శృతిపై బోర్ కొడితే...విడాకులు ఇచ్చేయొచ్చు. అలా చేస్తే కమల్ హాసన్ తనను పల్లెత్తి మాట కూడా అనలేని పరిస్థితి. ఎందుకంటే కమల్ హాసన్ తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి తన లవర్ గౌతమితో ఈ వయసులోనూ సహజీవనం చేస్తున్నాడు. అదన్న మాట సిద్ధార్థం ధైర్యం.
ఈ మేరకు శృతిని పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడని సమాచారం. సిద్ధార్థ కన్నింగ్ ప్లాన్ ను పసిగట్టిన శృతి అతని ప్రపోజల్ కు నో చెప్పేందుకు సిద్దమైందని చెన్నయ్ వర్గాల గుసగుస. మరి ఏం జరుగబోతోందో? చూడాలి మరి.


Click it and Unblock the Notifications