శృతి హాసన్ గురించి సిద్దార్ధ ట్వీట్..ఆమె క్విక్ రిప్లై

By Srikanya

Shriti Hasan
శృతిహాసన్,సిద్దార్ధ ల మధ్య ఎఫైర్ మాట ఏమో కానీ, వీరిద్దరి మధ్య మాత్రం మంచి రాపోర్ట్ ఉంది.తాజాగా సిద్దార్ద సెవెంత్ సెన్స్ విడుదల సందర్బంగా తన ట్విట్టర్ లో ఆల్ ది బెస్ట్...ఆమెను త్వరలోనే ప్రపంచం గుర్తిస్తుంది.ఆమె ఇక్కడ పరిశ్రమను ఏలుతుంది అని రాసాడు.దానికి వెంటనే శృతి హాసన్ రిప్లై ఇస్తూ...ధాంక్యూ సిద్దు...నీతో పని చేసి నేను చాలా నేర్చుకున్నా...నువ్వో క్రేజీ డైమండ్ వి అంది. ఇక శృతి హాసన్,సూర్య కాంబినేషన్ లో మురగదాస్ దర్శకత్వం వహించిన సెవెంత్ సెన్స్ చిత్రం ఈ రోజే విడుదల కాబోతోంది. అలాగే సిద్దార్ధ,శృతిల కాంబినేషన్ లో రూపొందుతున్న ఓ మై ప్రెండ్ చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు.

సిద్దార్ద హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ చిత్రం 11.11.11న ఉదయం 11గంటలకు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సిద్ధార్థ్‌, శృతిహాసన్‌, హన్సిక, నవదీప్‌ ముఖ్య తారాగణంలో వస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్‌'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ అధినేతలు దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌లు నిర్మిస్తున్నారు. వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ ప్రేమకథా చిత్రం నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలకు పేరొందిన ఈ సంస్థ నుండి వస్తోన్న మరో కలర్‌ ఫుల్‌, ఫీల్‌గుడ్‌ మూవీ. ప్రస్తుతం పూనాలో ఈ సినిమా చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. నవంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సిద్ధార్థ్, శ్రుతిహాసన్, హన్సిక, నవదీప్ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ "ఇలాంటి సినిమా దిల్ రాజుగారు మాత్రమే తియ్యగలరు. స్వతహాగా మంచి ఆర్టిస్టు అయిన సిద్ధార్థ్ ఎంతో ఎఫర్ట్‌పెట్టి నటించాడు. శ్రుతి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఆమెలో ఓ కొత్తకోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు'' అని చెప్పారు. అలీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, లక్ష్మీ రామకృష్ణన్, వినయ ప్రసాద్ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, కృష్ణచైతన్య, ఛాయాగ్రహణం: విజయ్ కె. చక్రవర్తి, డాన్స్: రాజు సుందరం, దినేశ్, రఘు, సుచిత్ర, కళ: ఎస్. రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: అశోక్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వేణు శ్రీరామ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X