twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాతి రేసులో రొమాంటిక్ హీరో కూడా...

    By Srikanya
    |

    చెన్నై: సంక్రాంతి పండగకు సినిమాలు వరస పెడుతూంటాయి. తాజాగా సిద్దార్ద కూడా తన తదుపరి చిత్రం కళాకారుడు కూడా సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారని సమాచారం. ఈ చిత్రం టీజర్ ఇప్పటికే రిలీజైంది. దాంతో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇంతకీ ఈ చిత్రానికి దర్శకుడు ఎవరూ అంటే... 'అంగాడితెరు', 'అరవాన్‌' వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రత్యేకత చాటుకొంటున్న దర్శకుడు వసంతబాలన్‌. ఈ చిత్రం విడుదలను సిద్దార్ద సైతం ఖరారు చేసారు.

    తమిళ ప్రేక్షకులకు ఎంతో ప్రీతిపదమైన వాస్తవిక, యదార్థ సన్నివేశాలతో వెండితెరపై విందు అందిస్తున్న ఆయన ప్రస్తుతం 'కావ్య తలైవన్‌'ను తెరకెక్కిస్తున్నారు. రంగస్థల నటుల జీవితాల ఆధారంగా కొన్ని సంవత్సరాల కిందట నాటి కథతో దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్‌, పృధ్విరాజ్‌, వేదిక తదితరులు నటిస్తున్నారు. వసంతబాలన్‌ సినిమా అంటేనే దాదాపు రెండు సంవత్సరాలన్నది మాట. ఆ విధంగానే ఈ సినిమా ఎప్పటి నుంచో చిత్రీకరణ జరుపుకొంటోంది.

    ప్రారంభంలోనే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు. దీపావళి సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌లోనూ సంక్రాంతికి వస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ట్రైలర్‌ వసంతబాలన్‌ మార్కు సినిమా శైలిని చాటుకుంటోంది. ఏదో వైవిధ్యం ఇందులో దాగినట్టు స్పష్టమవుతోంది.

    దీనికితోడు ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం హైలెట్‌గా నిలుస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే 12 పాటలను కంపోజ్‌ చేశారట రెహ్మాన్‌. మరోవైపు సంక్రాంతికి 'ఐ', 'లింగా' వంటి పెద్ద చిత్రాలు క్యూ కడుతున్నాయి. మరి 'కావ్య తలైవన్‌' బరిలో దిగుతుందో లేదో చూద్దాం.

     Sid’s bilingual Kaavya Thalaivan releases in

    ఇక తమిళంలో హిట్టైన సిద్దార్ద 'జిగర్‌దండా' కూడా విడుదల కు సిద్దమవుతోంది. లక్ష్మీమీనన్‌ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం తెలుగులో త్వరలో విడుదల కానుంది. చిక్కడు ..దొరకడు టైటిల్ తో ఈ చిత్రాన్ని ఇక్కడ డబ్ చేసారు. మదురైలో మంచి ఆదరణ ఉన్న పానీయం..'జిగర్‌దండా' . ఇప్పుడా రుచిని దక్షిణాది ప్రజలకు పరిచయం చేస్తున్నారు నటుడు సిద్ధార్థ్‌.

    'పిజ్జా' వంటి పెద్ద హిట్‌ చిత్రాన్ని అందించిన కార్తిక్‌సుబ్బురాజ్‌ దీనికి దర్శకత్వం వహించటంతో అక్కడ రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. మరోవైపు లక్ష్మీమీనన్‌ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటంతో కూడా ఓపినింగ్స్ అద్బుతంగా వచ్చాయి. అయితే తెలుగులో ఇప్పటికే ట్రైలర్‌, పాటలు పెద్దగా ఇక్కడ మన యూత్ ని ఆకట్టుకోలోకపోయాయి. తమిళ వాసన ఎక్కువ ఉండటంతో ఇక్కడెవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే రిలీజ్ అయ్యాక సినిమాలో విషయం ఉంది కాబట్టి ఆడే అవకాసం ఉందంటున్నారు.

    ఇప్పుడు సిద్దార్ధ, లక్ష్మీమీనన్‌, బాబీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని కర్నూలు, హైదరాబాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో, శంకర్‌ 'ఐ' సినిమాకు వాడిన అత్యాధునిక టెక్నాలజీ కెమెరాని ఈ చిత్రానికి ఉపయోగించారు. రెండు సంవత్సరాలపాటు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

    ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పుకునే అంశం ఈ సినిమా దర్శకుడు. తమిళ్‌లోనే కాక తెలుగులో కూడా తన మొదటి చిత్రంతోనే కమర్షియల్‌ సక్సెస్‌ని సాధించిన 'పిజ్జా' సినిమా దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ ఈ 'చిక్కడు దొరకడు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అదే మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణ్‌, అదే టీమ్‌ ఈ చిత్రానికి పని చేసారు.

    సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్‌ లైఫ్‌లో మొదలై కర్నూలు రౌడీషీటర్స్‌ ప్రపంచాన్ని టచ్‌ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్‌ మధ్య ట్రావెల్‌ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్‌ అవుతుంది. ఆడియన్స్‌ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్‌ గ్యాంగ్‌స్టర్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కింది.

    మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్‌, కెమెరా: సంతోష్‌ నారాయణ్‌, ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ మూవీస్‌), నిర్మాత: కదిరేశన్‌, దర్శకుడు: కార్తిక్‌ సుబ్బురాజ్‌.

    English summary
    Siddharth confirmed the film's release by tweeting "Getting ready for the best year end! #KaaviyaThalaivan releases worldwide on November 14th. #Enakkuloruvan ready for release too. I'm waiting! Thank you for the incredible support! This year has been special thanks to all the fans and supporters. You guys make everything worth it!!".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X