ఆఫర్స్ ఇవ్వటం లేదని వాపోయిన సిద్ధార్థ
నిజం చెప్పాలంటే నటించడానికి నేను రెడీ. ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. అందువల్లే నిర్మాతగా కూడా మారాను. ఇకపై వరుసగా తమిళ చిత్రాలు చేయాలనుకుంటున్నాను అంటూ తమిళ మీడియా వద్ద సిద్దార్ద వాపోయాడు. ప్రస్తుతం ఆయన నటించిన లవ్ ఫెయిల్యూర్ చిత్రం విడుదలకు సిద్దమైంది. వైనాట్ స్టూడియో ప్రొడక్షన్స్, ఇట్టకి ఎంటర్‌టెయిన్‌మెంట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లవ్ ఫెయిల్యూర్. సిద్ధార్థ్, అమలాపాల్ జంటగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మీనన్ దర్శకుడు. శశికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నటుడు సిద్ధార్థ్, కెమెరామెన్ నిరవ్‌షా తొలిసారిగా సహ నిర్మాతల బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఈ చిత్ర విశేషాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్ధార్థ్ పై విధంగా బదులిచ్చారు. ఇక తమిళ భాషలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో దిల్ రాజు అందిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. లవ్ ఫెయిల్యూర్ చిత్రం విడుదల తరువాత మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. 2012లో మంచి ఫలితాల్ని చవిచూస్తాననే నమ్మకం ఉంది. నాలుగైదు భాషల్లో నటిస్తున్నాను అని సిద్దార్ధ అన్నారు. ఇక లవ్ ఫెయిల్యూర్ చిత్రం గురించి చెపుతూ.. ఇది క్యూట్, ఫన్నీ చిత్రం. ఈ తరం యువత తీరును కళ్ల ముందుంచే చిత్రం. కళాశాల వాతావరణంలో సాగే యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టెయినర్. సీనియర్ నటుడు సురేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుంది. నేను రెండు పాటలు పాడాను అన్నారు.


Click it and Unblock the Notifications











