రెండో పెళ్లికి రెడీ అవుతున్న సిద్దార్ధ
సిద్దార్థ్ 2003లో తన గర్ల్‌ఫ్రెండ్ మేగ్నాను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో 2006లో విడాకులు పొందారు. ఇప్పుడు మళ్లీ రెండో పెళ్లికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.మరో నెలలో ఇందుకు సంభందించిన ప్రకటన రానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని మీడియా వారు అడిగితే.. మీరీ ప్రశ్న వేస్తారని తెలుసు. విశే షమేమిటనేది నెల తర్వాత చెబుతా అన్నారు. ఇక గత కొంత కాలంగా హీరోయిన్ శృతిహాసన్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఆయన నటించిన చిత్రం ఓ మై ప్రెండ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు.
అందులో శృతి హాసన్,సిద్దార్ధ కేవలం స్నేహితులుగానే కనిపిస్తారు. తాము కలిసి పెరిగి,తిరిగినంత మాత్రాన ప్రేమ కాదని, స్నేహమేనని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ చిత్రం గురించి సిద్దార్ద చెపుతూ..చాలా హ్యాపీగా ఉన్నాను. నేను తెలుగులో నటిం చిన ఓ మై ఫ్రెండ్ ప్రజాదరణ పొందింది అన్నారు.ప్రస్తుతం ఆయన చేస్తున్ చిత్రాల గురించి చెపుతూ..తమిళంలో కాదలిల్ సొదప్పువదు ఎప్పడి చిత్రంతోపాటు గణిత శాస్త్ర మేధావి రామానుజన్ జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాను. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 11 ఏళ్లు అయ్యింది. ఈ ఏడాది నాకు చాలా విశేషమైంది అన్నారు.


Click it and Unblock the Notifications











