twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో 65 థియేటర్లు పెంచారు..సూపర్ హిట్

    By Srikanya
    |

    చెన్నై : సిద్ధార్థ్‌, లక్ష్మీమీనన్‌ జంటగా నటించిన చిత్రం 'జిగర్‌దండా'. గత శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకాదరణకు నోచుకుంది. ఈ నేపథ్యంలో మరో 65 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత కదిరేశన్‌. దాంతో ఈ చిత్రం సూపర్ హిట్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రిలీజైన మొదటి రోజు నుంచీ ఈ చిత్రం కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వరస ఫ్లాపుల్లో ఉన్న సిద్దార్దని ఈ చిత్రం ఒడ్డున పడేసిందనే చెప్పాలి.

    నిర్మాత కదిరేశన్‌ మాట్లాడుతూ...''మా చిత్రం అన్ని సెంటర్లలోనూ మంచి కలెక్షన్లతో ఆడుతోంది. సిద్థార్థ్‌ నటనకు మంచి పేరొచ్చింది. లక్ష్మీమీనన్‌ను కొత్త కోణంలో చూపించారని అందరూ మెచ్చుకుంటున్నారు. మరో 65 థియేటర్లలో ఆదివారం నుంచి విడుదల చేస్తున్నాం. తెలుగు అనువాద పనులు పూర్తయ్యాయి. 'చిక్కడు దొరకడు' అని టైటిల్‌ పెట్టాం. వచ్చే నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి'' అన్నారు.

    Siddarth attains big hit with Jigarthanda

    అలాగే ...''ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్‌ చేస్తాం. అక్కడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. పైరసీ వల్ల వసూళ్లపై భారీ ప్రభావం పడుతోంది. అందువల్లే కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. గతంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం 'మూండ్రుముగం' రీమేక్‌ హక్కులను మేమే సొంతం చేసుకున్నాం. హీరోగా ఎవర్నీ ఎంచుకోలేదన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తాము''అని చెప్పారు.

    సిద్దార్ధ, లక్ష్మీమీనన్‌, బాబీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని కర్నూలు, హైదరాబాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో, శంకర్‌ 'ఐ' సినిమాకు వాడిన అత్యాధునిక టెక్నాలజీ కెమెరాని ఈ చిత్రానికి ఉపయోగించారు. రెండు సంవత్సరాలపాటు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

    సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్‌ లైఫ్‌లో మొదలై కర్నూలు రౌడీషీటర్స్‌ ప్రపంచాన్ని టచ్‌ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్‌ మధ్య ట్రావెల్‌ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్‌ అవుతుంది. ఆడియన్స్‌ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్‌ గ్యాంగ్‌స్టర్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కింది.

    మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్‌, కెమెరా: సంతోష్‌ నారాయణ్‌, ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ మూవీస్‌), నిర్మాత: కదిరేశన్‌, దర్శకుడు: కార్తిక్‌ సుబ్బురాజ్‌.

    English summary
    Chikkadu dorakadu of Siddarth is about to release in Telugu now or then but mean while it has been a hit in Tamil industry , Naming Jigarthanda love story of a Gangster starring Siddarth and Lakshmimenon attained hit in the other state , Now Siddarth is quite confidently back into the track with his venture in tamil .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X