అల్లు అర్జున్ స్ఫూర్తి : షార్ట్ ఫిలింలో ఇంకో హీరో

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్ షార్ట్ ఫిలింలో కనిపించటం అందరికీ ప్రేరణ ఇచ్చినట్లుంది. దాంతో మరో యువ హీరో సిద్దార్ద ఓ షార్ట్ ఫిలింలో కనిపించటానికి సన్నాహాలు చేసుకుంటన్నారు. పిజ్జా దర్శకుడు కార్తీక సుబ్బరాజు ఈ షార్ట్ ఫిలిం ను డైరక్ట్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన స్టోన్ బెంచ్ క్రియేషన్స్ అని కంపెనీను స్ధాపించారు. ఆ కంపెనీ లోగోను భారతీ రాజా లాంచ్ చేసారు. చాలా మంది తమలాగ ప్రతిభ ఉన్న యువత బయిట ఉన్నారని, వారిలో ఉన్న టాలెంట్ ని వెలికి తీయటానికి నిర్ణయించుకునే ఈ కంపెనీను స్ధాపించినట్లు తెలిపారు. అలాగే ఈ షార్ట్ ఫిలిం ను థియోటర్లల లో విడుదల చేస్తామన్నారు. తమలాగ ఎవరైనా చేసి సబ్ టైటిల్స్ తో ప్రపంచంలో ఎక్కడైనా విడుదల చేయవచ్చని అన్నారు.

సిద్దార్ద చిత్రాల విషయానికి వస్తే...

:సిద్ధార్థ్‌, లక్ష్మీమీనన్‌ జంటగా నటించిన తమిళ చిత్రం 'జిగర్‌తండ'. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. కదిరీశన్‌ నిర్మాత. తెలుగులో 'చిక్కడు దొరకడు' పేరుతో విడుదలవుతోంది. వచ్చే నెల రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రం మొదట తమిళ,తెలుగులో ఒకే సారి విడుదల చేయాలనుకున్నారు. అయితే రకరకాల కారణాలుతో ఆగిపోయింది. తర్వాత తమిళంలో ఈ చిత్రం విజయం సాధించింది. దాంతో ఇప్పుడీ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

Siddharth doing a short film

నిర్మాత మాట్లాడుతూ ''తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రమిది. సిద్ధార్థ్‌లోని నటుడిని మరో కోణంలో ఆవిష్కరించింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా అందరినీ అలరిస్తుంద''న్నారు.

ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పుకునే అంశం ఈ సినిమా దర్శకుడు. తమిళ్‌లోనే కాక తెలుగులో కూడా తన మొదటి చిత్రంతోనే కమర్షియల్‌ సక్సెస్‌ని సాధించిన 'పిజ్జా' సినిమా దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ ఈ 'చిక్కడు దొరకడు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అదే మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణ్‌, అదే టీమ్‌ ఈ చిత్రానికి పని చేసారు.

సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్‌ లైఫ్‌లో మొదలై కర్నూలు రౌడీషీటర్స్‌ ప్రపంచాన్ని టచ్‌ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్‌ మధ్య ట్రావెల్‌ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్‌ అవుతుంది. ఆడియన్స్‌ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్‌ గ్యాంగ్‌స్టర్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కించారు.

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్‌, కెమెరా: సంతోష్‌ నారాయణ్‌, ఎడిటింగ్‌: వివేక్‌ హర్షన్‌, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ మూవీస్‌), నిర్మాత: కదిరేశన్‌, దర్శకుడు: కార్తిక్‌ సుబ్బురాజ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X