సిద్దార్ద కేవలం కో ప్రొడ్యూసరే.. హీరో కాదు
సిద్దార్ధ తాజాగా విక్కీ డోనర్ అనే హిందీ చిత్రం తమిళ,తెలుగు రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం లో హీరోగా సిద్దార్ద చేస్తాడనే వార్తలు వినిపించాయి. అయితే సిద్దార్ద మేనేజర్ రామ్ మాత్రం వీటిని ఖండిస్తున్నారు..సిద్దార్ద డెఫినెట్ గా విక్కీ డోనర్ రీమేక్ లో చేయడు అన్నారు. విక్కీ డోనర్ చిత్రాన్ని శశి అనే వ్యక్తి తరుపున సిద్దార్ద కొనుగోలు చేసారు. వై నాట్ స్టూడియోస్ కి చెందిన శశితో సిద్దార్దకి స్నేహం ఉంది. అందుకే శశి తరపున సిద్దార్ద నిర్మాత జాన్ అబ్రహంతో మాట్లాడి ఆ చిత్రం రైట్స్ తీసుకున్నారు.
ఇక విక్కీ డోనర్ చిత్రం తెలుగు వెర్షన్ కి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. వీర్యదానం సబ్జెక్టుతో కామిడీ గా రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ గా విజయవంతమవటమే కాక విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని ఇప్పటికీ ధియోటర్లలో తన హవా కొనసాగిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం విభిన్నమైన కధాంశంతో వచ్చిన సున్నితమైన ప్రేమ కథ అంటూ ఈ సినిమాను మెచ్చుకున్నారు. తమిళ,తెలుగు భాషల్లో కొత్త హీరోతో ఈ చిత్రం చేయాలని సిద్దార్ద భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మరో ప్రక్క ఈ చిత్రం ఇచ్చిన స్పూర్తితో మధుర శ్రీధర్ వంటి వారు వీర్యదానం కధాంశంతో చిత్రాలు నిర్మించటానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఆయన ఈ చిత్రం కోసం దానకర్ణ,దానకర్ణుడు అనే టైటిల్స్ ని ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేసారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. మల్టిప్లెక్స్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందే ఈ చిత్రం వారికి బాగా నచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక ఈ విషయమై మధుర శ్రీధర్ మాట్లాడుతూ...విక్కీ డోనర్ చూసి నేను ప్రేరణ పొందలేదు. పేపర్లో వచ్చిన స్పెర్మ్ డొనేషన్ మీద వచ్చిన ఓ ఆర్టికల్ చదివి కథ రెడీ చేసుకున్నాను. చెన్నైకి చెందిన ఓ జంట ఆన్ లైన్లో ఐఐటి పాస్ అయిన వ్యక్తి వీర్యం కావాలంటూ ప్రకటన ఇచ్చారు. అది చదివిన దగ్గరనుంచి నేను ఆలోచనలో పడి ఆ పాయింట్ మీద సినిమా చెయ్యాలనుకున్నాను. నా సినిమా ఓ ప్రేమ కథ. సరోగెట్ మదర్ కి,స్పెర్మ్ డొనేటర్ కి మధ్య జరుగుతూంటుంది అని వివరించారు. గతంలో మధుర శ్రీధర్...ఇట్స్ మై లవ్ స్టోరీ,స్నేహ గీతం చిత్రాలు డైరక్ట్ చేసారు. భాక్సాఫీస్ వద్ద ఫలితం ప్రక్కన పెడితే ఈ చిత్రాల ద్వారా చాలా మంది కొత్త వాళ్లు పరిశ్రమకు పరిచయమయ్యారు.


Click it and Unblock the Notifications











