సిద్దార్ధకీ సిక్స్ పాక్ ఎందుకంటే...
సిక్స్ పాక్ సంప్రదాయంగా మారి బాలీవుడ్ నుంచి ఇక్కడకు వలస వచ్చేసింది. దాంతో మన హీరోలు కూడా కాస్త జిమ్ లకు వెళ్ళి కష్టపడటం ప్రారంభించారు. ఇప్పుడు అదే రూటులో లవర్ బోయ్ గా పేరు పడ్డ సిద్దార్ధ ప్రయాణం పెట్టుకున్నాడని సమాచారం. ప్రస్తుతం రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాష్ దర్శకత్వంలో ఓ ఫాంటసీ ఫిల్మ్ చేస్తున్న సిద్దార్ధ తన తర్వాత సినిమాని రవిబాబు డైరక్షన్ లో చేస్తాడని తెలుస్తోంది. హిందీ సినిమా లక్ష్య తరహాలో ఉండే ఈ చిత్రం కోసం ఎయిట్ ప్యాక్ అవసరం అన్నారుట. అయితే తాను ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు దృష్టిలో పెట్టుకుని సిక్స్ పాక్ తో సిరిపెట్టుకోమని ఆ దిశలో ట్రై చేస్తున్నాడని చెప్తున్నారు. ఇక రవిబాబు తాజాగా అమరావతి అనే ధ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పలు పరాజయాలు తర్వాత అనసూయ, నచ్చావులే చిత్రాలతో రవిబాబు ట్రాక్ లోకి వచ్చి హిట్ కొట్టారు. అలాగే సిద్దార్ధ కొంచెం ఇష్టం కొంచెం కష్టం,ఓయ్ చిత్రాలు భాక్సా ఫీస్ ని మెప్పించకపోవటంతో ఎలాగైనా బొమ్మరిల్లు రేంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.


Click it and Unblock the Notifications











