twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్:సిద్దార్ద “లవ్ ఫెయిల్యూర్ ”

    By Srikanya
    |

    ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ ఏమిటీ అంటే సిద్దార్ద “లవ్ ఫెయిల్యూర్ ". అదేంటిది శృతి హాసన్ తో ఏమన్నా చెడిందా అనుకోకండి..“లవ్ ఫెయిల్యూర్ "అనేది సిద్దార్ద తాజా చిత్రం టైటిల్. ఓహ్ మై ప్రెండ్ రిలీజ్ తర్వాత సిద్దార్ద చేస్తున్న చిత్రం ఇది. అమలా పౌల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని బాలాజీ మోహన్ అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. ఎస్.శశికాంత్ అనే నిర్మాత దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే సిద్దార్ద కూడా తన కొత్త ప్రొడక్షన్ కంపెనీ ద్వారా ఈ చిత్ర సహ నిర్మాతగా వ్యవహిస్తున్నాడు. అలాగే ప్రముఖ ఛాయాగ్రహకుడు నీరవ్ షా ఈ చిత్రానికి కెమెరా వర్క్ చేస్తున్నారు.

    ధమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక శృతి హాసన్ తో దిల్ రాజు నిర్మించిన ఓహ్ మై ప్రెండ్ చిత్రం సిద్దార్ద వరస ఫెయిల్యూర్స్ లో ఒకటిగా చేరిపోయింది. చాలా కాలం నుంచి సిద్దార్ద ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ఏదీ అతనికి సక్సెస్ ఇవ్వలేకపోతోంది. దానికి కారణం అతను ఇన్వాల్వెమెంటేనని అతనితో పనిచేసిన దర్శకులు చెప్తూంటారు. కొత్త దర్శకులుకు అవకాసం ఇచ్చి స్క్ర్రిప్టు దగ్గరనుండి,డైరక్షన్ దాకా అన్ని విభాగాల్లోనూ వేలు పెట్టి దర్శకుడుకి స్వేచ్చ లేకుండా చేసి సినిమాలను పాడు చేస్తున్నాడనే అపప్రధ ఉంది. ఈ చిత్రం ద్వారా కూడా ఓ కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. అతన్ని అయినా తన పని తాను చేసుకోనిచ్చి హిట్ కొట్టేలా చేస్తాడని ఆశిద్దాం.

    English summary
    Sidharth has started shooting for his next movie titled ‘ Love Failure ‘ and is paired with Amala Paul who plays female lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X