మణిరత్నం సినిమా అయితేనే చేస్తారట!!
తమిళ బాయ్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన నటుడు సిద్ధార్థ. ఇపుడు హిందీలో బిజీ అయ్యాడు. రంగ్ దే బసంతీ హీరోయిన్ సోహా అలీఖాన్ తో ముంబైలో చెట్టాపట్టాల్ కూడా కొడుతున్నాడు. ఆమెతో ప్రేమాయణం నడుపుతున్నాడు. తమిళం, హిందీకి మధ్య తెలుగులోనూ నటించాడు సిద్ధార్థ.
హిందీలో నెమ్మదిగా బిజీ అవుతున్న సిద్ధార్థను తమిళంలో నటించరా అని అడిగితే లేదన్నాడు. మళ్లీ మినహాయింపునిస్తూ మణిరత్నం సినిమాలో అయితే నటిస్తానని అన్నాడు....మణిరత్నం పిలిస్తే తప్పక తమిళంలో నటిస్తా...అన్నాడు.
సిద్ధార్థలాగే నటి ఐశ్వర్యారాయ్ తమిళంలోనే తెరంగేట్రం చేసింది. ఈమెగారు హిందీలో బిజీ అయిన తరువాత తమిళం అంటే నో అనేదిట. రజనీకాంత్ కొత్త సినిమాకు సంతకం చేసినపుడల్లా ఐశ్వర్యను సంప్రదించేవాడట. హీరోయిన్ గా చేయమని అడిగేవాడట. ఆమె ప్రతిసారి ఏ మాత్రం సంకోచించకుండా నో చెప్పేదట. అయితే మణిరత్నం దర్శకత్వంలో అయితే తప్పక చేస్తాను అనేదట.


Click it and Unblock the Notifications











