twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Siima Awards 2021: ధనుష్ 'అసురన్'కు అవార్డుల పంట.. ఎన్ని అవార్డులంటే?

    |

    సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్( సైమా-2021 ) వేడుక హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు దక్షిణాది భాషలకు చెందిన తారాలోకం తరలివచ్చింది. కరోనా(Covid-19) కారణంగా ఈ కార్యక్రమం నిర్వహించ లేదు దీంతో 2019 సంవత్సరానికి సంబంధించిన సైమా' అవార్డులను ఈ ఏడాది ప్రధానం చేశారు. నిన్న తెలుగు అవార్డులను ప్రధానం చేయగా ఈరోజు తమిళ అవార్డులను ప్రధానం చేయనున్నారు. నిన్న వేడుకల్లో మహేష్ హీరోగా నటించిన మహర్షి చిత్రానికి అవార్డుల పంట పండింది. మహర్షి సినిమా 10 విభాగాల్లో నామినేట్ అవ్వగా 5 అవార్డులను అందుకోవడం విశేషం. ఇందులో నటనకిగానూ ఉత్తమ నటుడిగా మహేష్‌బాబు ఎంపికయ్యారు. అదే చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటుడిగా అల్లరి నరేష్‌, ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌, ఉత్తమ గేయ రచయితగా శ్రీమణి పురస్కారాలు అందుకున్నారు. తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషా చిత్రాలకు అవార్డులు ఇస్తారు.

    ఈ నేపథ్యంలో ఈ ఏడాది అవార్డుల ప్రదానోత్సవం నిన్న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ లో అసురన్ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడు అవార్డు వెట్రిమారన్‌కు దక్కింది. అలాగే, అసురన్ సినిమాలో ధనుష్ చిన్న కుమారుడిగా నటించిన కెన్ కరుణాస్ ఉత్తమ నూతన నటుడు అవార్డును గెలుచుకున్నాడు. 'అసురన్' చిత్రంలోని 'ఎల్లు వయ పూకలయే' పాటను అద్భుతంగా పాడినందుకు సైంధవికి ఉత్తమ గాయని అవార్డు లభించింది. అలాగే అసురన్ చిత్రానికి వేల్‌రాజ్ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఖైదీ ఉత్తమ చిత్రంగా నిలవగా అర్జున్ దాస్ ఉత్తమ విలన్ మరియు జార్జ్ మారియన్ ఉత్తమ సహాయ నటుడు అవార్డులు గెలుపొందారు. మహామునిలో నటనకు ఇందుజా రవిచంద్రన్ ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకుంది. కోమాలి చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రదీప్ రంగనాథన్ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును మరియు కాస్ట్యూమ్ ఫిల్మ్‌ను నిర్మించిన వి స్టూడియోస్ ఉత్తమ డెబ్యూ ప్రొడ్యూసర్ అవార్డును గెలుచుకున్నారు.

    Dhanush Starrer Asuran Bags five Awards in Siima Awards 2021.

    బిగిల్ చిత్రంలోని 'సింగప్ పెన్నే' పాట రాసినందుకు అజిత్, విశ్వాసం కోసం ఇమాన్ ఉత్తమ స్వరకర్త అవార్డును మరియు వివేక్ ఉత్తమ పాటల రచయిత అవార్డును గెలుచుకున్నారు. సైమా అవార్డులలో అవార్డులు గెలుచుకున్న అసురన్ సినిమా బృందానికి చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు. నిజానికి వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాలో నటనకు గాను ధనుష్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికయ్యారు. జాతి వివక్ష అనే సామాజిక అంశం ఆధారంగా తెరకెక్కిన అసురన్ మూవీలో యువకుడిగా, మధ్య వయస్కులైన తండ్రిగా ధనుష్, అద్భుత నటన కనబరిచారు. గతంలో ఆడు కాలం చిత్రానికి ధనుష్ నేషనల్ అవార్డు గెలుపొందగా ఇది రెండో సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దీనిని తెలుగులో కూడా రీమేక్ చేశారు, వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను నారప్ప పేరుతొ రిలీజ్ చేయగా మంచి స్పందన తెచ్చుకుంది.

    English summary
    Dhanush Starrer Asuran Bags five Awards in Siima Awards 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X